త్యానందైకపరుండు, గాంగఝరనిత్యస్నాత, రాకానిశా
సూనాంగీశశిరోవిభూషణుఁ డటంచున్ నిన్ను ధ్యానించు భ
క్తానీకంబుల పై పయిన్ గరుణ రాదా నీకు విశ్వేశ్వరా !
' మా స్వామి ' లో ఆరవ పద్యమిది.
నీహారము అంటే మంచు. నీహారనగాధిరాజు హిమవంతుడు. ఆయన కుమార్తె హైమవతి లేక పార్వతి. పార్వతి ముఖపద్మం యొక్క అందాన్ని నిత్యం ఆస్వాదించి, ఆనందించే హక్కుదారుడు శివుడు. ఆయన జటావనుల్లో సుడులుగా తిరుగుతున్న గంగాజలం చేత ఆయన నిత్యాభిషిక్తుడు. అంతేకాదు. ఆయన రాత్రిపూట పూచే పువ్వు, చంద్రుడిని, తలపై ధరించినవాడు. ఇన్ని విశేషణాలతో కీర్తించే భక్తుల పైన కరుణ రాదా అని విశ్వనాథ పరమేశ్వరుణ్ణి వేడుకొంటున్నారు.
మంచుకొండలో నివాసముండి, మంచుకొండ కూతురును వివాహమాడి, గంగాజలంతో నిత్యాభిషిక్తుడౌతూ, తలపై నున్న అమృతాంశుడు, అమృతకిరణాలను వర్షిస్తుండగా, కంఠంలో విషం దాచుకున్నా, ఎల్లప్పుడూ చల్లగా ఉండే దేవుడు, భక్తులను చల్లగా చూడటంలో అబ్బురమేముంది !
శివుని పరంగా విశ్వనాథ ఈ పద్యంలో వాడిన విశేషణాలు, గుండె పొరల్లో ఆడుతూ, మననం చేసుకొనే వారిని, భక్తిపారవశ్యంలో ముంచెత్తుతాయి. ఏకాంతంగా, ధ్యాన ముద్రలో, ఈ విశేషణాలను మనఃపథంలో నిలుపుకుంటే, ఆనందతన్మయత్వం కలుగుతుందనేది స్వీయానుభవం.
No comments:
Post a Comment