దెప్పన్ జూచెద, రద్ది పెట్టెదను, నా త్రిప్పల్ పడన్ లేక నీ
వొప్పన్ బిల్తువు మధ్యవర్తులను, వారో స్వామి ! హా ! నీదియున్
దప్పేనందురు, కాన సంధి కెటులైనన్ రమ్ము విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని నలభై ఐదో పద్యం.
" వీశ్వేశ్వరా ! నాయనా ! నీకు లోకం సంగతి అసలు తెలియదు. అది ఎలాంటిదంటే, నాకు నేనుగా నిన్ను పీడిస్తాను, నానా తిట్లు తిడతాను, రచ్చ రచ్చ చేస్తాను. ఆ బాధలు పడలేక, నువ్వేమో మధ్యవర్తులను పిలుస్తావు. స్వామీ ! వాళ్ళంతా పంచాయతీ జరిపి, చివరికి నీది కూడా తప్పున్నదంటారు. కాబట్టి ఏదో సర్దుబాటు చేసుకోమంటారు. "
ఇక్కడ " నిన్ను " అనేదానికి అర్థం ఒక వ్యక్తిని అని.
విశ్వనాథ యీ పద్యంలో ఊళ్ళలో, తగాదాలు-తీర్పుల పేరిట జరిగే తంతును చక్కగా వివరించారు.
No comments:
Post a Comment