బెండై తేలుచు వచ్చి నా యతనిఁ బిప్పింజేసి రమ్మంచు, రా
ముండున్ రాతిరిఁ జచ్చునంచుఁ గనులన్ మోడ్పంచు నింతైనలే
కుండం గడ్పితి వాడు చావడును నాకున్ ఱెప్పలున్ వ్రాలెడున్.
అకటా ! వారిని జంపఁ నేర్తురని రవ్వంతాశయున్ లేద, యే
లికనై చంపగ పోవగా నగునె గేలింగాగ నీ మేడ నీ
యొక మాత్రంబుగఁ గూర్కిపోయెద, మహాయుద్ధోర్వి నా రాము
జంపకయే తప్పదటంచు దోచెడిని, చంపన్ న్యాయమై పొల్చునో !
నాగబంధాలను విడిపించుకొన్న రామలక్ష్మణులను గురించి రావణుడి సందేహం ఇంకా ఎక్కువయింది. అసలు రాముడు మానవమాత్రుడా? లేక తనను వధించటానికై అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువా? అన్నది ఆ అనుమానం. ఆ విధమైన ఆలోచనలతో నిద్రపట్టని రావణుడు పట్టపురాణి మండోదరి సౌధానికి వచ్చి, ఆమెతో తన గోడును చెప్పుకొంటున్నాడు.
" మండోదరీ ! యుద్ధంలో బాగా ఆరితేరినవారిని, సముద్రము మీద బెండులాగా చాలా తేలికగా తేలుతూ వచ్చిన ఆ రాముడిని పిప్పిగా చేసి రమ్మని పంపించాను. ఈ రాత్రి రాముడు మరణిస్తాడని కంటి మీద కునుకనేది లేకుండా గడిపాను. రాముడు చావలేదు సరి కదా ! నాకు నిద్ర మాత్రం ముంచుకొస్తున్నది.
రాముడిని వీళ్ళు చంపగలుగుతారని రవ్వంత ఆశ కూడా లేదు. రాజు నైనటువంటి నేను యుద్ధానికి పోదామంటే, అదేమన్నా బాగుంటుందా? నీ సౌధంలో ఒక కునుకు తీసి వెళ్తాను. భీకరమైన యుద్ధంలో, రాముడిని చంపకుండా తప్పేటట్లు లేదు. కానీ, చంపటం న్యాయమంటావా ?
చెప్పరాని మూర్ఖత్వంతో, రాముడు ఖరదూషణాదులని చంపాడు. అందుకని, నేను ఆయన భార్యను తీసుకువచ్చాను. దానికి దీనికి సరిపోయింది. సీతను తెచ్చి కూడా ఒక ఏడాది గడిచిపోయింది. ఆమెను వెతుక్కొంటూ ఈయన సముద్రం దాటి వచ్చాడు. ఆయన పట్టుదల, పరాక్రమం నేను కూడా మెచ్చుకొంటున్నాను. సరే ! వచ్చినవాడు " ఓయి ! పరాక్రమశాలి ! నా భార్యను నాకు ఇచ్చివేయమని అడుగవచ్చును కదా ! ఏమో అలా అడిగితే ఇచ్చేవాడినేమో ! "
ఈ పద్యాలలో రావణుని మనస్సు పొరలలో దాగి ఉన్న భయం, కపటత్వం, వంచన, అన్నీ వ్యక్తమౌతున్నాయి. పరమ వివేకవంతురాలైన మండోదరి ఇవన్నీ గుర్తుపట్ట లేదనుకొంటే, అది పొరపాటవుతుంది.
రావణుని మనసు పొరలను విప్పిచూపే ఈ మనోవిశ్లేషణాత్మక పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, కుంభకర్ణ ఖండము లోనివి.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధము కాండము, కుంభకర్ణ ఖండము లోనివి.
No comments:
Post a Comment