వలు పాటించెడు నేత వీ జనులు చెప్పన్ మాంసభుక్తంబు విం
తల కోరల్ మిడిగ్రుడ్లు లేని దితిసంతానంబు నీ వాసురా
ఖిల ప్రాణానిల దందశూకమవు, ద్యోకేశాంత ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని నలభై యేడో పద్యం.
" విశ్వేశ్వరా ! ఈ లోకం లోని జనులు సిగ్గూ లజ్జా లేని వాళ్ళు తండ్రీ ! నీవేమో న్యాయాన్ని, ధర్మ మార్గాన్ని పాటించే ప్రభువువి. నిజం చెప్పాలంటే, ఈ జనం, నరమాంసం తినటం కానీ, కోరలు, మిడుగ్రుడ్లు కానీ లేనటువంటి దితిసంతానమైన రాక్షసులు. నీవు వారి ప్రాణవాయువులను హరించే భుజగాధిపతివి. "
దందశూకము అనగా పాము.
దితి సంతానం దైత్యులు లేక రాక్షసులు. పాము గాలిని ఆహారంగా తీసుకొంటుందని పురాణల్లో చెబుతుంటారు. అందుచేత, శివుడు వారి ప్రాణాలను హరించే భుజగాధిపతిగా చెప్పబడింది. ద్యోకేశాంత! అనే సంబోధన వల్ల, అతడు సర్వ్యవ్యాపకుడని, సర్వాంతర్యామి అని తెలుసుకోవచ్చు.
విశ్వనాథ ఈ పద్యంలో, లోకం లోని క్రూరస్వభావులను గురించి చెప్పారు.
No comments:
Post a Comment