నర్ఘంబుల్ చిలికింతు నంజలిపుటం బందిమ్ము, హేమంత ప్రా
తర్ఘాసంబులు బిల్వపత్రములు మందారాది పుష్పాలు నీ
కర్ఘం బిచ్చెద, రమ్ము తీర్చెద పథాయాసంబు, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై ఆరో పద్యం.
" విశ్వేశ్వరా! చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. ఏవీ, నీ పాదా లిట్లా పెట్టు. కాసేపు, ఒత్తుతాను. ఏవీ, నీ చేతులు చాచు. చల్లని నీళ్ళను చిలకరిస్తాను. హేమంత ఋతువులో మంచుకు తడిసిన పచ్చని గరిక, బిల్వపత్రాలు, మందారపూలతో నీకు పూజ చేస్తాను. రా ! ఇట్లా వచ్చి కూర్చో ! నీవు ప్రయాణం చేసి వచ్చిన బడలిక తీరుస్తాను. "
ఈ పద్యంలోని ప్రతి మాట, మనం అతిథి అభ్యాగతులకు చేసే సపర్యలను తలపింపజేస్తాయి. నిత్యపూజలో మనం చేసే షోడశోపచారాల పరమార్థం కూడా, మానవుడిలో మాధవుడిని చూడమని చెప్పటమే. ఈ పద్యంలో, భక్తునికి, భగవంతునికి మధ్య కల ఆత్మీయతారాధనా భావం ప్రస్ఫుటమౌతుంది.
No comments:
Post a Comment