రత్నంబుల్ మెఱపించుకొన్నవి దిశల్ రంజిల్ల సౌదామనీ
పత్నీ దేహములందు నీ కరుణ యన్ భ్రాంతిన్ విలోకింతు నా
యత్నంబుల్ నినుఁబొందు నెప్పగిది నూహాతీత ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఇరవైతొమ్మిదో పద్యం.
" విశ్వేశ్వరా ! ఆకాశం లక్ష్మీకళను సంతరించుకొని క్రొత్తగా కనిపిస్తున్నది. ఉరుములతో కూడిన దట్టమైన మేఘాలు ఆకాశమంతా అలుముకున్నాయి. దిక్కులు శోభిల్లేటట్లు మెరుపుతీగలు అప్సరసల వలె రత్నకాంతులను విరజిమ్ముతున్నాయి. ఈ ప్రకృతి దివ్యసౌందర్యమంతా నీ దయ అనే భ్రాంతితో కళ్ళారా చూస్తాను. ప్రకృతిలో నీ దివ్యదర్శనం చేస్తున్న నా ప్రయత్నాలు వాస్తవ రూపం దాల్చి, నేను నిన్ను చేరుకొనే మార్గం చూపించు ప్రభూ ! "
ప్రకృతి లోని అణువణువూ పరమేశ్వరుని యొక్క దివ్యవిభూతి. వేదభాగమైన రుద్రాధ్యాయం పిపీలికాది బ్రహ్మ పర్యంతం పరమేశ్వరుని యొక్క అంతర్యామిత్వాన్ని తెలియజేస్తుంది.
No comments:
Post a Comment