ముయ్యేఱై ప్రవహించుఁ గానియెడ శంభూ ! దివ్యవారాణసీ
శయ్యానిద్రితు నిన్ను మేల్కొలిపి దీక్షన్ దెచ్చె మా తండ్రి తా
నియ్యామ్యావని నందమూరునకు నింకే రీతి? విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ముప్పదినాల్గవ పద్యం.
" విశ్వేశ్వరా ! స్వామీ ! భక్తుల పైన నీ కరుణామృతం, పవిత్ర గంగాజల తరంగాల వలె ప్రవహిస్తూ ఉంటుంది. అదే కనుక నిజం కాకపోతే, ఎక్కడో పవిత్రస్థలమైన వారాణసిలో నిద్రిస్తున్న నిన్ను మేలుకొలిపి, మా తండ్రి దక్షిణదేశంలో ఈ మూలనున్న నందమూరునకు ఎలా తేగలడు? "
గంగానదికి త్రిపథగ (మూడు లోకాల్లో చరించేది) అనే పేరున్నది. దానినే అచ్చ తెలుగులో ' ముయ్యేఱు ' అంటారు.
పూర్వం ' కాశీకి పోయినవాడు కాటికి పోయినట్లే ! " అనేవారు. ప్రయాణ సౌకర్యాలు లేని రోజులవి. అందుచేత, ఎక్కడో ఉత్తరభారతదేశంలో ఉన్న కాశీవిశ్వేశ్వరుడిని దక్షిణపాంతం లోని ఒక మారుమూల పల్లెకు తీసుకొనిరావటం, పూర్వజన్మపుణ్య విశేషం ఉంటేనే గాని సంభవించే పని కాదు.
No comments:
Post a Comment