మననౌ జాబిలి కాజపూ వెరువు పెల్లై సారమౌ దుబ్బుల
ల్లిన యుండల్ మెయి బూదిపూఁత తెలిఢిల్లీభోగముల్ చేను నీ
వనెదన్ మా పితృపాదు లమ్మని పొలం బౌ దీవు విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ముప్పదియెనిమిదవ పద్యం.
" విశ్వేశ్వరా ! మా తండ్రి, మా తాత ముత్తాతలు సంపాదించిన భూములను అమ్మివేశారు కానీ, ఒక్కటి మాత్రం చేయలేదు. నీవు, ఆయన అమ్మకుండా, నిరంతరం నమ్ముకొన్న భూమివి. ఆ చేనులో, మానవ కపాలాలు చూస్తే కాజగడ్డలు గాను సర్పాంగద కంఠహారాలు కాజ ఆకులు గాను, శిరోభూషణమైన చంద్రుడు కాజపూవు గాను, జీబురుగా అల్లుకొని ఉండలు కట్టిన మైజడలు సారవంతమైన ఎరువు గాను, ఒంటికి పూసుకొన్న బూడిద తెల్లని ఢిల్లీవరి బియ్యం గాను
కనిపిస్తున్నాయిఅందువల్ల, నీవు మా తండ్రి అమ్మని, మేము నమ్ముకొన్న పొలానివి. "
భూమిని నమ్ముకొన్నవాడు చెడిపోడు. నమ్మిన దైవాన్ని కొలిచేవాడికి కొరత ఉండదు.
No comments:
Post a Comment