దాతృత్వంబున కాఁగలేదు కవితాధమ్మిల్ల కల్హార సు
శ్రీ తావుల్, తిరిపెంబురాయఁడవు నీ సేవల్, ద్విధామార్గముల్
యాతాయాత నిరంతయాతనయు నాయాసంబు, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ముప్పదియారవ పద్యం.
" విశ్వేశ్వరా ! మా ముత్తాతలు, తాత సంపాదించిన ఆస్తిపాస్తులు, మా తండ్రి దానధర్మాలకు హరించుకొని పోయాయి. కవితాసతి కొప్పులో ముడిచిన కలువపూల గుబాళింపు ఒక వైపు, బిచ్చమెత్తుకొని తిరిగే నీ సేవ ఇంకొక వైపుగా నా జీవిత ప్రయాణం రెండడుగులు ముందుకు, మూడడుగులు వెనక్కిగా, అంతులేని వేదన, వృధాశ్రమను మిగులుస్తున్నాయి తప్ప ఇంకొకటి లేదు. "
ఆత్మాశ్రయ కవిత్వంలో, కవి తన మనసు లోని మాటను, బాధను భగవంతునికి నివేదించుకొనటం శతక సాహిత్యంలో పరిపాటి. అదే కోవలో, విశ్వనాథ తన గోడును విశ్వేశ్వరునికి విన్నవించుకున్నారు.
No comments:
Post a Comment