కా కీ సంసృతి యొండు వెంటఁబడి యీ కాంతాసుతుల్ పేరిటన్
నా కాళ్ళన్ బెనవైచుకొన్నయది కంఠానన్ దగుల్కొన్న దీ
శోకం బేగతి మాన్పెదో గిరిసుతాశుద్ధాంత ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని అరవైరెండో పద్యం.
" విశ్వేశ్వరా ! నాకు చిన్నతనం నుండి వైరాగ్య భావనే ఉన్నది. కానీ, ఈ సంసార మనేది ఒకటి నా వెంటబడి, భార్య, పిల్లలు అనే పేరుతో, నా కాళ్ళకు పెనవేసుకొన్నది. నా మెడకు చుట్టుకొన్నది. పార్వతీహృదయవల్లభా ! ఈ సంసార దుఃఖాన్ని నీవెట్లా తొలగిస్తావో కదా ! "
సంసార మనేది దుఃఖకారణం. సంసార దుఃఖం నుండి విముక్తి పొందాలంటే జీవితంలో వైరాగ్య భావన కలగాలి. పరమేశ్వరుని కృప ఉంటే, సంసారయాత్ర కొనసాగిస్తూనే, తామరాకు మీద నీటి బొట్టులాగా, కర్తవ్యం నిర్వహిస్తూ, విషయవాంఛలకు దూరంగా ఉండవచ్చు. విశ్వనాథ, చిన్నతనం నుండి తనకున్న వైరాగ్యభావనకు కొనసాగింపుగా, భగవత్కృపను కోరుకొంటున్నారు.
" గిరిసుతాశుద్ధాంత ! " అనే సంబోధనలో, భారతీయ దాంపత్య జీవనానికి ప్రతీక అయిన అర్థనారీశ్వరతత్త్వం ప్రతిబింబిస్తున్నది.
No comments:
Post a Comment