యను వాంఛించెను స్వామి, యేమి యగుఁ జేయాడంగ రాకుండినన్
దనకుం దమ్మునకున్ దనూయుగమునం దంగేడులై పూచెఁబూ
చిన తంగేడులు నెఱ్ఱతేనె లొలికించెన్నాఁగఁ గన్పించుచున్.
ఇంద్రజిత్తు నాగపాశంతో రామలక్ష్మణులను బంధించాడు. శరీరం పక్షవాతం వల్ల రాయిలాగా గట్టిగా అయిపోయినట్లు, నిస్సత్తువ ఆవహించి, రామలక్ష్మణులు దేవతావిగ్రహాల్లాగా నిలబడిపోయారు. పూర్వం కబంధుడు పట్టుకొన్నప్పుడు కుడా ధైర్యం కోల్పోని రణధీరుడు శ్రీరాముడు, కన్నుల్లో జాలి స్రవిస్తూ ఉండగా, తమ్ముడిని చూసి, " వీడొకడు నా వెంటబడి వచ్చి ఈ విధ0గా కష్టాలు పడుతున్నాడు" అని అనుకొన్నాడు.
కంటికి కనపడకుండా ఆకాశమార్గంలో సంచరిస్తూ మాయాయుద్ధం చేస్తున్న మేఘనాథుడు, చుక్కలమార్గంలో ఎక్కడున్నాడో కన్నుక్కొని రమ్మని సుషేణుడు, నీలాంగదుడు, శరభుడు, వినతుడు, జాంబవంతుడు మొదలైన కపివీరులని పంపించాడు రాముడు. వాళ్ళు మిన్నంతా తిరిగారు కానీ, వారికి ఇంద్రజిత్తు ఎక్కడా కనపడలేదు. వారంతా ఇంద్రజిత్తు బాణాల చేత కొట్టబడి, ఏదుపందుల్లాగా తిరిగొచ్చారు.
" రాముడు అల్లెత్రాటినిని మోగించి ఇంద్రజిత్తుని విమొహంలో పడేద్దామనుకున్నాడు. కానీ, ఏం చేయగలడు? అతడికి , తమ్ముడు లక్ష్మణుడికి శరీరమంతా తంగేడుపూలు పూచినట్లుగా ఎఱ్ఱగా అయింది. ఆ పూచిన తంగేడులు ఎఱ్ఱని తేనెధారలు స్రవిస్తున్నట్లుగా ఒళ్ళంతా రక్తం కారుతున్నది. "
యుద్ధవర్ణనలు చేయటంలో, తిక్కనసోమయాజి వలె, విశ్వనాథ చేయి తిరిగినవాడు. రక్తంతో తడిసిముద్దయిన రామలక్ష్మణుల శరీరాలను తంగేడు పూలతో పోల్చటం విశ్వనాథ కల్పనాప్రతిభకు ఒక ఉదాహరణ.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోనిది.
No comments:
Post a Comment