తనుకన్, శ్రీ నవగాంగవారి చినుకన్, తారుణ్యరేఖా వినూ
తన సౌందర్యము పిల్లతెమ్మెరలు చిందన్, నన్ను నానంద వా
సన పొందన్, మరి నీదు రాక గురుతింపన్ లేనె? విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై అయిదో పద్యం.
" విశ్వేశ్వరా ! నా తండ్రీ ! నువ్వు నన్ను రక్షించటానికి వచ్చావ్ని తెలుసు. ఈ చంద్రకిరణాలు ప్రకాశించగా, గంగానది యొక్క స్వచ్ఛమైన నీటితుంపరలు చిందగా, యవ్వనంలోని వినూత్నమైన నీ తనూసౌందర్యం చల్లని గాలి వీచగా, నన్ను ఆనందమనే సువాసన ఆవరించగా, నా మనస్సు నీ రాకను గుర్తించకుండా ఉంటుందా? "
చంద్రుడు, గంగానది, శివుని సగుణాకారంలో భాగాలు. ఇక శివుడు నిత్యయవ్వనుడు. ' శివ ' అన్న శబ్దం లోనే మంగళస్వరూపుడనే అర్థం ఉంది. శివుడు ఆనందమయ స్వరూపుడు. ముక్తి అంటే ఆనందసిద్ధి పొందటమే కనుక, కవిసమ్రాట్టులు ఆ బ్రహ్మానంద సిద్ధి కలగాలని కోరుకొంటున్నారు.
No comments:
Post a Comment