లామాధుర్యము లేది దుఃఖమయవేళా గ్రీష్మసూర్యాతపౌ
ష్ణ్యమందత్వము చేత బీడువడి యంతా నెఱ్ఱెలై యున్న దిం
కేమో సాగుకుఁ గుంభవృష్టి పడి కానీ రాదు, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ఏభయ్యొకటో పద్యం.
" విశ్వేశ్వరా ! స్వామీ ! నా బ్రతుకు ఎడారిలాగా ఎండిపోయి ఉంది. నీ కరుణ అనే వర్షించే దట్టమైన మేఘసమూహం యొక్క తీయదనం లేకపోవడమే దానికి కారణం. దానికితోడు, జీవితంలోని సంఘటనలు, ఈతిబాధలు అనే మండిపోయే , తీవ్రమైన ఎండల వల్ల, వడగాల్పుల వల్ల బీడుపడి పోయి, బీటలు వారిన భూమి లాగా అయిపోయి దుఃఖాన్ని కల్గిస్తున్నది. బిందెలతో నీరు కుమ్మరించినట్లు వర్షం పడితేనే కానీ, యీ నెఱ్ఱెలిచ్చిన భూమి సాగు చేయటానికి వీలుపడదు. "
విశ్వనాథ ఆత్మాశ్రయ ధోరణిలో చెప్పిన మాటలు, ప్రతి ఒక్కరి జీవితానికి అన్వయం చేసుకోవచ్చు. భగవంతుని దయ లేకపోతే, జీవితమంతా అస్తవ్యస్తమౌతుంది. ఎడారిలాగా మారిపోతుంది. ఎడారిలాగా మారిన జీవితం మరల సాగుకు రావాలంటే, పరమేశ్వరుని కరుణ అనే కుంభవృష్టి కురవాలి.
No comments:
Post a Comment