తా శూన్యం బగు, క్షీరవార్థి వటపత్రంబందు నిద్రించు న
ట్లే సుప్తిన్ గలగందు, మేలుకొని నట్టేటన్ గనుల్ తేల్తు, నీ
యాశాహేమకురంగ కృష్టుడను, ముక్తాసుండ, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని నలభై మూడో పద్యం.
" విశ్వేశ్వరా ! నాకు దగ్గర లోనే సమస్త సంపదలు ఉన్నట్లు అనిపిస్తుంది. తీసుకొందామని చేయి చాచేటప్పటికి, అక్కడంతా ఖాళీగా కనిపిస్తుంది. పాలసముద్రంలో వటపత్రం మీద నిద్రిస్తున్నట్లు ఆ నిద్రావస్థ లోనే కలగంటాను. మేలుకొని చూస్తే, నట్టేటిలో మునిగిపోయినట్లై, కళ్ళు తేలవేస్తాను. ఈ రకంగా బంగారులేడి వెంటబడిన వాడినయ్యాను. ప్రాణాలు కడబడుతున్నాయి. "
సంసారయాత్రలో తాపత్రయాలు ఎక్కువ. అది కావాలి, ఇది కావాలి అని పరుగులాట లాడుతుంటాము. చివరకు, అక్కడ ఏమీ లేక నిరాశ ఎదురవుతుంది. ఊహల్లో తేలిపోతుంటాము. ఊహల్లో, మన మందరం, పాలకడలిపై వటపత్రశాయిలమే. యదార్థ జగత్తులో మాత్రం ఆశోపహతులం. సంసారయాత్ర బంగారులేడి వెంట పరుగులాట వంటిది. ఇదీ జీవుని పరిస్థితి. భౌతిక జగత్తులోను, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా జరుగుతున్నది ఇదే.
No comments:
Post a Comment