దుండానన్ గొని తెచ్చి పూజలిడఁగా, ద్యుత్యున్నతంబుల్ ఫణా
దండంబందునఁ దెచ్చి రత్నములు పాదద్వంద్వమున్ జేర్పఁగా
నిండారన్ బెను భక్తి కబ్ధి గతిఁ బొంగే రాదు, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ఇరవైఅయిదో పద్యం.
" విశ్వేశ్వరా ! పుక్కిట బట్టిన నీటితో స్నానం చేయించటానికి గానీ, చెట్లకొమ్మలను తొండముతో తీసుకొని వచ్చి పూజ చేయటానికి గానీ, మెరిసిపొయే రత్నాలను పడగమీద మోసుకొని వచ్చి నీ పాదాల చెంత చేర్చటానికి గానీ, సముద్రము పొంగులాగా నిండైన భక్తి నాకు కలుగనే కలగటం లేదు. "
ఆటవికుడు తిన్నడు మూఢభక్తితో నోటిలో నింపుకొని వచ్చిన నీటితో శివలింగాన్ని కడగటం, ఏనుగు, చెట్లకొమ్మలతోను, ఆకులతోను, పాము రత్నాలతోను పూజ చేయటం, ధూర్జటి మహాకవి వ్రాసిన శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యంలో చదువుకున్నాము. వారందరూ శివసాయుజ్యం పొందటానికి, వాటి యొక్క భక్త్యావేశమే కారణం. అంతటి పెనుభక్తిని తనకు కలిగించమని కవి వేడుకొంటున్నాడు.
No comments:
Post a Comment