క్షావైశద్యము పొల్చు నీ తనువు నీశా ! అన్నపూర్ణాంబికా
దేవిం జూచిన వృద్ధ వోలె మదికిన్ దీపించు దాంపత్య మీ
భావం బెవ్వఁ డెఱుంగు శైలతనయా ప్రాణేశ ! విశ్వేశ్వరా !
' మా స్వామి ' లో పదకొండవ పద్యమిది.
" పార్వతీహృదయవల్లభా ! విశ్వేశ్వరా ! త్రిపురాసుర సంహారకాలలోని నీ యుద్ధనైపుణ్యం చూస్తే నీవు యువకుడిలాగా అనిపిస్తావు. ఇక అన్నపూర్ణాదేవిని చూస్తే మనసుకి వృద్ధురాలిలాగా అనిపిస్తుంది. ఈ దాంపత్యం వెనుక ఉన్న భావం ఎవరికి తెలుస్తుంది. "
త్రిపురాసుర సంహారానికి, శివుడు భూమిని రథంగా, మేరుపర్వతాన్ని విల్లుగా, విష్ణువును బాణంగా చేసుకొన్నాడు. దానిలో, ఆయన యవ్వనం ఉట్టిపడుతుంది. కాశీలో, అన్నపూర్ణ ఎప్పుడూ గరిటె పట్టుకొని, ఆకలితో వచ్చేవారికి వడ్డిస్తూ, వృద్ధురాలిగా కనిపిస్తుంది.
విశ్వనాథ ఈ శతకంలో శివుని పరంగా వాడిన విశేషణాలు అద్భుతంగానే గాక భావస్ఫోరకంగా ఉన్నాయి. ఉదాహరణకు, " శైలతనయాప్రాణేశ ! " అనే విశేషణాన్ని " దాంపత్య మీ భావం బెవ్వ డెఱుంగు " అన్న దానితో అనుసంధానం చేస్తే, శివపార్వతుల అవిభాజ్య అర్థనారీశ్వర తత్వం, భారతీయ దాంపత్య జీవనానికి ఏ విధంగా ప్రతీకగా నిలిచిందో అవగతమౌతుంది.
No comments:
Post a Comment