కుల దైవంబువలెన్ ముభావమున నీకున్ జేఁత మేలయ్య? నీ
తలపై వేలుపుబువ్వ క్రొత్తరఁగ మొత్తాలూరి ముయ్యేటి చెం
గలువల్ జార్చిన తేనె నా పయినిఁ జిల్కన్ రాదె విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని అరవయ్యో పద్యం.
" విశ్వేశ్వరా ! నీవు మా కులదైవానివి. నా కష్టాలు తీర్చమని, నీకు తలవంచి మొక్కులు మొక్కుకొన్నాను. ఇప్పుడు నీవేమో లోకుల (ఇతరుల) దైవం లాగా మౌనంగా ఉండటం సబబేనా? నీ తలపై నున్న అమృతాంశుని (చంద్రుని) చల్లని కిరణాలన్నీ ఊటగా మారి, ఆకాశగంగ లోని కలువలు స్రవించిన మధుధారలుగా, నీ కరుణ నా పైన చిలుకరించరాదా స్వామీ ! "
విశ్వనాథవారి స్వగ్రామం నందమూరులో, వారి పెద్దల చేత నిర్మింపబడిన రెండు దేవాలున్నాయి. అవి వేణుగోపాలస్వామి, కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయాలు. విశ్వేశ్వరుడు వారి కులదైవం. అటువంటి కులదైవం, లోకుల (ఇతరుల/అందరి) దైవంగా మారిపోయాడని చమత్కారం చేశారు విశ్వనాథ.
పద్యం యొక్క్క మూడు, నాలుగు పాదాల లోని అచ్చ తెలుగు పదాలు ' వేలుపుబువ్వ (అమృతం), ' ముయ్యేరు (గంగానది) ' , పద్యం మొత్తాన్ని సువాసనాభరితం చేశాయి.
గంగానది మూడు లోకాల్లో ప్రవహిస్తుంది.. అందుకే, ఆ నదిని ' త్రిపథగ (ముయ్యేరు) ' అని పిలుస్తారు. మర్త్యలోకంలో అది గంగానది, స్వర్లోకంలో మందాకిని, పాతాళలోకంలో భోగవతి.
No comments:
Post a Comment