ణీతేధ్మప్రోజ్జ్వల వహ్నికారవము లెంతే దట్టమై, జాట వీ
థీ ధ్మాతామరవాస్తరంగమయి, యింతే మొఱ్ఱ విన్పించదో !
క్రుధ్మంతుడవొ? దోస ముండిన యెడన్ రూపించు, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ఇరవయ్యొకటవ పద్యం.
" విశ్వేశ్వరా ! ప్రమథగణాలు ఊదుతున్న శంఖముల ధ్వని వెల్లువలో, దేవతలను సంతృప్తి పరచటం కోసం యాజ్ఞికుల చేత మంత్రసహితంగా వ్రేల్చబడుతున్న సమిధల నుండి వెలువడే అగ్నిజ్వాలల చిటపటలు దట్టమై, జటావనుల నుండి సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న ఆకాశగంగాతరంగాలతో నిండిపోయి, నా మొర నీకు వినిపించటం లేదా? లేకపోతే నా మీద కినుక వహించావా? స్వామీ ! నా తప్పు ఏదయినా ఉంటే, దానిని నిరూపించవచ్చు కదా ! "
శివునికి ప్రమథనాథుడని పేరు. ప్రమథగణాలలో, భూత, ప్రేత, పిశాచ, రాక్షస, నాగ, గుహ్యక, మనుష్య, దేవ, గంధర్వ, విద్యాధర, సిద్ధ, సాధ్య గణాలెన్నో ఉన్నాయి. వీరిలో, నందీశ్వర, భృంగీశ్వర, చండికేశ్వరులు ప్రముఖులు.
No comments:
Post a Comment