అతినైరాశ్యము నిన్ను వంటి సురసంఘాధ్యక్షు పాదాంబుజ
ద్వితయారాధన శీలవంతులకు, నింతే తప్పదాయేని, యే
గతి కల్పింతు సతీకృతామరధునీకా ! మాకు విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ఏభయ్యో పద్యం.
" చంద్రశేఖరా ! విశ్వేశ్వరా ! నా బ్రతుకు ఎడారి లాగా చేస్తావా తండ్రీ ! దేవతల సమూహానికి నాయకుడవైన నీ వంటి వాడి పాదపద్మాలను పూజించే శీలవంతులకు కూడా తీవ్రమైన నైరాశ్యం తప్పకపోతే, ఇక మా వంటి వారి గతి ఏమిటి? "
శీతాంశుడు అంటే చల్లని కిరణాలు కలవాడు. చంద్రుడు. చంద్రుడిని కిరీటంగా పెట్టుకొన్నవాడు శివుడు.
" సతీకృతామరధునీకా ! " అంటే, స్వర్లోకగంగను భార్యగా చేసుకొన్నవాడు. శివుడు.
దేవతలకు రక్షణగా నిలిచే శివునికి మానవుల యోగక్షేమాలను చూడటం పెద్ద విషయం కాదని కవి భావన. శివుని పాదపద్మాలను ఎల్లప్పుడూ కొలిచే పుణ్యాత్ములకే, శివుని కరుణాకటాక్షాలు కలుగకపోతే, ఇక సామాన్య మానవుల సంతేమిటని కవి ప్రశ్నిస్తున్నారు.
No comments:
Post a Comment