శుక్లద్వాదశి చంద్రఖండము జటాజూటిన్ బ్రసూనంబు, ని
త్యాక్లాంతంబును భస్మపుప్పొడి, మధుస్యందంబు ద్యోగంగ, నా
యీ క్లేశంబు హరింప సౌరతరుమూర్తీ ! చూడు, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఇరవయ్యేడో పద్యం.
" విశ్వేశ్వరా ! నీవు పరాక్రమోపేతుడవైన అర్థనారీశ్వరుడివి. నీ జడలు చిగురుటాకులు. నీ జటాజూటం లోని శుక్లద్వాదశి నాటి అర్థచంద్రుడు పువ్వు. ఎప్పుడూ చెరిగిపొని నీ మేని భస్మపు పూత పుప్పొడి. ఆకాశగంగ, పుష్పమకరందం. నా దుఃఖాన్ని పొగొట్టే కల్పవృక్షానివి నీవు. "
శివుడు అర్థనారీశ్వరుడు. అయినా, త్రిపురాసుర సం హారం చేసిన మహాపరాక్రమవంతుడు. ఆయనకు నీలలోహితుడని పేరు. ఆయన జడలు నీలము, ఎరుపు కలిసిన, చిగురుటాకుల రంగులో ఉంటాయి. ఆయన శిరోభూషణమైన అర్థచంద్రుడు ఒక పువ్వులాగా ఉంటుంది. ఆయన శరీరానికి రాసుకున్న బూడిద, పుప్పొడి కనుక ఏ విధంగా ఫలదీకరణకు ఉపయుక్తమో, ఆ విధంగా, ప్రళయానంతర పునఃసృష్టికి ఉపకరించే విత్తన సంపద. శంభుని శిరస్సు నుండి భువికి దిగివచ్చిన ఆకాశగంగ జీవుల ప్రాణాధారమైన జలసంపద. ప్రాణుల అన్నార్తిని, దాహార్తిని తీర్చే దేవతావృక్షమైన కల్పతరువు వంటివాడు శివుడు.
No comments:
Post a Comment