దీవెండో, తనుభూషలన్ దలలపై దీపించు రత్నంబులో,
నీ వేదో యొక యింత యిచ్చినను గానీ చాలు దారిద్ర్యమే
ఘావష్టంభము తీవ్రమారుతహుతంబైపోవు, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని నలభై తొమ్మిదో పద్యం.
" విశ్వేశ్వరా ! పోవయ్యా స్వామీ ! నీ పదహారు వెన్నెల బంగారపు ధనుస్సు నుంచి గానీ, నువ్వు నివాసమున్న స్వచ్ఛమైన వెండికొండ నుంచి గానీ, నువ్వు ఆభరణాలుగా ధరించిన పాముల తలలపై నున్న రత్నాల నుంచి గానీ, ఏదో ఒక కొంత నాకు ఇస్తే చాలు, బాగా వీచే గాలికి మేఘాలు చెల్లచెదురై పోయినట్లుగా, నా దరిద్రం తొలగిపోతుంది కదా ! "
త్రిపురాసుర సంహార కాలంలో, శివుడు మేరుపర్వతాన్ని విల్లుగా చేసుకొన్నాడు. మేరుపర్వతానికి బంగారుకొండ అని పేరు. శివుని నివాసం రజతాద్రి. శివుడు సర్పాంగదకంఠభూషణుడు. సర్పాల తలలపై రత్నా లుంటాయని ప్రతీతి.
No comments:
Post a Comment