త్యార్వాచీన భవచ్ఛ్రితావనకళా వ్యాసంగ పారీణతా
ఖర్వ శ్రీమధుమూర్తి దీనజనరక్షాకంకణ ధ్వానముల్
పర్వన్ దిక్కుల నేఁగుదేరఁగదె నన్ బాలింప విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని నలభై ఒకటో పద్యం.
" విశ్వేశ్వరా ! లోకంలో, అంతా నాకు ప్రతికూలంగా ఉన్నట్లు అనిపిస్తున్నది. నిన్ను ఆశ్రయించిన సేవకజనాన్ని రక్షించటం అనే కళావ్యాసంగంలో పరిణతి చెందిన అమృతమూర్తివి నీవు. దీనజనులను రక్షించటానికి కంకణం కట్టుకొన్నవాడివి. ఆ కంకణధ్వనులు నలుదిక్కులా మారుమ్రోగేటట్లుగా నీవు అరుగుదెంచి నన్ను పాలింపరాదా ! "
జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు, భగవదనుగ్రహం కోసం ఎదురుచూడటం లోకసామాన్యమైన విషయం. అందుచేత, కష్టకాలంలో ఉన్న కవి, తనను కాపాడమని వేడుకొంటున్నాడు.
No comments:
Post a Comment