దో నే నొక్కఁడనే మహాగహనమందున్ నిల్చి నీ తేజమున్
బ్రాణాయామమునందుఁ జూచి ' శివ ! నిర్వాణైకమూర్తీ ! నిరం
తానందైక మయస్వరూప ' యనుచున్ ధ్యానింతు విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని అరవైఆరో పద్యం.
" విశ్వేశ్వరా ! తండ్రీ ! ఈ సంసారమనే నిస్సారమైన మహాసముద్రాన్ని దాటి, ఎక్కడో నేనొక్కడినే ఏకాంతంగా, ఎవ్వరూ చొరరాని గుహలో నిల్చి, నీ దివ్యతేజస్సును ప్రాణాయామంలో చూసి, " శివ ! నిర్వాణైకమూర్తీ ! నిరంతానందైకస్వరూప " అంటూ ఏ నాడు ధ్యానం చేస్తానో కదా ! "
నిర్వాణం అంటే మోక్షం. పరమేశ్వరుడు, శుభాన్ని కలిగించేవాడు, మోక్షప్రదాత, ఆనందమే స్వరూపంగా కలవాడు. ఆ స్వరూప దర్శనం కావాలంటే, ఏకాంతము, నిశ్చలమైన ధ్యానస్థితి కలగాలి. అటువంటి, ధ్యానసిద్ధిని విశ్వనాథ కోరుకొంటున్నారు.
No comments:
Post a Comment