స్త్రాసంబౌ మృతి యున్న దంచెఱిఁగియున్ దన్మార్గమే పట్టి
నట్లే సామీ యిది జీవి లక్షణము, నిన్నే సన్నుతింపంగ లే
నే సంస్తోత్రము సేయఁబోదు జనుఁ డింతే సామి ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఏభై ఆరో పద్యం.
" విశ్వేశ్వరా ! ప్రపంచం లోని జీవులు, సంసారమనే సముద్రము లోతు తెలియక, దానిని ఈదుతున్నట్లే, మనస్సుకు విపరీతమైన భయాన్ని కలిగించే (దుఃఖకారణమైన) మరణం ఉన్నదని తెలిసి కూడా, మరల ఆ సంసారమనే దారినే ఎంచుకుంటున్నారు స్వామీ ! ఇది జీవుని యొక్క లక్షణం. దరి చేర్చే వాడివి నీవని తెలిసి కూడా, నీ గుణనామ సంకీర్తనం కానీ , నీ స్తోత్రం కానీ చేయలేరు. ఈ జీవుడింతే స్వామీ ! "
సంసారం సాగరం అంటారు. దాని విస్తీర్ణం, లోతు తెలియక, దాని నీదుకుంటూ వెళ్ళి ఆవలి తీరానికి చేరాలనుకోవటం మూర్ఖత్వం. అదేవిధంగా, పుట్టిన ప్రతి జీవికీ మరణ మనేది ఉంది. అది తెలిసి కూడా సంసార సుఖాల కోసం ప్రాకులాడుతుంటారు ప్రపంచజీవులు. ఇది జీవుల లక్షణం. ఆ ప్రాకులాటలో, వారు ఎక్కడనుంచి వచ్చారో, ఆ మూలస్థానాన్ని మరచిపోతారు. సంసారమనే సాగరంలో పడి ఈదుకుంటూ పోవటమే తప్ప, దరిచేర్చే నావ అయినటువంటి భగవంతుని గురించి కొంచెం కూడా ఆలోచించరు. ఇదీ జీవుని స్థితి.
No comments:
Post a Comment