జీబుల్ గట్టిన మింటి క్రొత్తరఁగలో చిన్నారి జాబిల్లి గా
రాబంపున్ దనికించు వెన్నెలల దారా లల్లులో కీలు బొ
మ్మై బందిన్ గొనె నా తలంపు తెమలింపన్ రాదె విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఏభై తొమ్మిదో పద్యం.
" విశ్వేశ్వరా ! పాములు సంభోగం సమయంలో విడిచిపెట్టిన కుబుసం లాగా ఉన్న ఉండలు గట్టిన జడలలో, ఆకాశగంగా తరంగాలలో, అర్థచంద్రుడు వెండి దారాలవంటి వెన్నెలలు కురిపిస్తుండగా, నిన్ను గురించి నా తలపులన్నీ కీలుబొమ్మలాగా బందీ అయిపోయినాయి. వాటిని విడిపించి నా విషయంలో స్పందించరాదా స్వామీ ! "
ఆత్మాశ్రయ కవిత్వ ధోరణిలో, విశ్వనాథ శివుని సగుణాకార వర్ణన చేస్తూ, తనను ఉద్ధరించమని వేడుకొంటున్నారు.
No comments:
Post a Comment