ప్రవరు కరమ్మునన్ వెలుగు పాశుపతాస్రము జూచి దైత్య దా
నవ సుర యక్ష రాక్షస గణమ్ము గరమ్ము భయమ్ము బొందె నం
దవనియు దిర్దిరం దిరిగె నబ్ధిశిలోచ్ఛయసంచయంబుతోన్.
శివుడు అర్జునునకు పాశుపతాస్త్రాన్ని ఇచ్చి మాయమయ్యాడు. అప్పుడు ధనంజయుడి చేతిలో నున్న పాశుపతాస్త్రం వేయి సూర్యమండలాల ప్రకాశంతో వెలిగిపోతున్నది. సంస్కృతంలో ' సహస్ర ' శబ్దం అనంతమైన, అంతులేని, మిక్కిలి అనే అర్థాలనిస్తుంది. అంతటి వెలుగులు విరజిమ్మే పాశుపతాన్ని చూసి దైత్యులు, దానవులు, దేవతలు, యక్షులు, రాక్షసుల సమూహాలు చాలా భయం పొందాయి. పర్వతాలు, సముద్రాలతో సహా, భూమి గిర గిరా తిరిగింది.
ధనంజయ శబ్దానికి విష్ణువు, అర్జునుడు, అగ్ని అని మూడు అర్థాలున్నాయి. ధనంజయ ప్రవరుడు అనడంలో ధనంజయులలో ప్రవరుడు అని అర్థం. మూడవపాదంలో, ' గణమ్ము కరమ్ము భయమ్ము బొంది ' అనే సమాసంలో ద్విరుక్త మకారం భయతీవ్రతను తెలియజేస్తున్నది.
దైత్యులు దితి వల్ల, దానవులు దనువు వల్ల, సురలు, అదితి వల్ల, కలిగిన కశ్యపుని సంతతి. యక్షులు దేవయోనితో ఉద్భవించినవారు.
శ్రీమదాంధ్ర మహాభారతము, అరణ్యపర్వము, ప్రథమాశ్వాసంలోని ఈ పద్యం పాశుపతాస్త్రం యొక్క అద్భుతమైన శక్తిని తెలియజేస్తున్నది.
No comments:
Post a Comment