దనులకు ధర్మమూర్తులకు ధర్మ వెఱుంగక యిట్టు లెగ్గు
జేసిన ధృతరాష్ట్రజాధము నశేషసుహృత్సుతబంధుదాహసూ
చనమయి లక్క యిల్లతికృశానుశిఖాహతి గ్రాగె గ్రక్కునన్.
శ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వము, షష్టాశ్వాసము లోని ఈ పద్యం పాండుకుమారుల ధర్మనిరతిని, ధార్తరాష్ట్రుల దురాగతాన్ని వెల్లడిస్తూ, భావికథా సూచనను చేయడం విశేషం.
వారణావతంలో లక్క ఇల్లు తగులబడిపోతున్నది. రహస్యబిల మార్గం లోనుంచి భీముడు, తల్లిని, అన్నదమ్ములను, సురక్షితంగా అరణ్యప్రదేశానికి తీసుకువచ్చాడు.
" ఎల్లప్పుడూ సత్యం మీద ఆసక్తి కలవారు, వినయసంపన్నులు, ధర్మమూర్తులైన పాండుకుమారులకు, అధర్మంగా కీడు తలపెట్టిన కుటిల ధార్తరాష్ట్రులు, మిత్రులు, పుత్రులు, బంధువులతో సహా నశించిపోవటాన్ని సూచిస్తూ, లక్క ఇల్లు అగ్నిజ్వాలల్లో కాలిపోయింది. "
పెద్దలు ' చెఱపకురా చెడేవు ' అనే సామెత చెపుతారు. కీడు తలపెట్టిన వానిని కాలం కాటేయక తప్పదు. మిత్ర, పుత్ర, బంధు గణమంతా దుర్యోధనుని కళ్ళముందే ఒక్కొక్కరుగా కురుక్షేత్ర మహాసంగ్రామంలో నశించటం తప్పదని ధ్వనిపూర్వకంగా ఈ లాక్షాగృహదహనం సూచిస్తున్నది.
ధర్మరాజు నిత్యసత్యవ్రతుడు. తమ్ములను ఆ దారిలో నడిపించాడు. అందుకే, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు " తమ్ములు ధర్మరాజునకు తమ్ములు చెప్పినయట్లు సేయగా " అన్నారు.g
No comments:
Post a Comment