గవిసెన్ నిక్కముగా నమాయకత, నా కంఠంబు గోయంగ నెంచు
విరోధిన్ సయితమ్ము నే నదుమఁగాఁ జూడన్ మహాకోప మే
చు వడిన్ దగ్గును నిష్ఠ చాల దరులన్ జూర్ణింప, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని ఎనభై ఎనిమిదో పద్యం.
" విశ్వేశ్వరా ! కవిని శివుని అంశ కలవాడని ఇందుకే అంటారనుకొంటాను. నీ లాగే, నాకు కూడా నిజంగా బోలెడంత అమాయకత్వం వచ్చింది. నా మెడ తెగ్గోద్దామనుకొనే శత్రువుని సైతం నేను అడ్డుకోవాలని అనుకోను. విపరీతమైన కోపం వస్తుంది, వెంటనే తగ్గిపోతుంది. శత్రువులను నిలువరించేటంత శ్రద్ధ, తీవ్రత, నాలో లేవు స్వామీ ! "
శివుడికి బోళాశంకరుడని పేరు. అదే విధంగా, విశ్వనాథ కూడా ఎవరన్నా కష్టాల్లో ఉంటే కరగిపోయే స్వభావం కలవాడని ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు, ఆయన దాతృత్వాన్ని చవి చూసినవారు, అనుయాయులు, శిష్యులు చెప్పే మాట. వారు బ్రాహ్మీమయమూర్తే గాదు, పదహారణాల బ్రాహ్మణుడు కూడా ! మాట కఠినం, మనసు వెన్న.
No comments:
Post a Comment