ళ్ళాయాచోటుల బడ్డచో గొఱికివేయంజాలు శ్రీరామచం
ద్రాయాసంబగు, స్వామి వచ్చునెడ మార్గంబందు గోపాదరే
ఖాయత్తంబగు నధ్వమెల్ల జెడరాదయ్యా భవత్పద్ధతిన్.
శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతుడై అరణ్యవాసానికి వస్తున్నాడు. ఈ వార్త మున్యాశ్రమాలకు చేరింది. బహు జన్మల తపః ఫలితంగా, ఆ వచ్చే రాముడు అవతారమూర్తి అని ఎఱుక కలిగిన మునులు, మునిపత్నులు, సీతారామలక్ష్మణులకు స్వాగత సత్కారాలు నెరపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొందరు ఆడపిల్లలు పూలమాలలు కడుతున్నారు. కొందరు పెద్దవాళ్ళు, పిల్లలకు ఆ పని , ఈ పని పురమాయిస్తున్నారు.
" ఓరే నాయనా! నీవు అడవిలోనికి దర్భలు కోయడానికి వెళ్ళినప్పుడు, మన ఆశ్రమంలోని లేడిని కూడా తోడు తీసుకువెళ్ళు. మీరొచ్చే దారిలో ఏవన్నా ధర్భమోళ్ళు పడితే కొరికేస్తుంది. లేకపోతే, అవి రామచంద్రుని కాలికి గుచ్చుకొని, ఆయనకు బాధ కలుగుతుంది. ఇప్పటికే ఆవుల కాలిగిట్టలతో చక్కగా ఏర్పడిన ఆశ్రమానికి వచ్చే దారి, ఈ దర్భమోళ్ళు పడటం వల్ల చెడిపోకూడదు. "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్యకాండము, దశవర్ష ఖండంలోని ఈ పద్యము మున్యాశ్రమవాసుల భక్తిశ్రద్ధలను పట్టి చూపుతున్నాయి.
No comments:
Post a Comment