నానాస్వాదుసుధావచస్సమయ నిష్ణాతుండు శ్రీరాముడౌ
తనకై రాము డజాంబరీష రఘుమాంధాత్రాది రాజన్య తే
జోనిర్ణీత నృపాలభావమతి సంశుద్ధుం డవిద్ధాత్ముడున్.
దశరథుడు శ్రీరామునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు. దానికి, మహాపరిషత్తు అంగీకారం తెలిపి, శ్రీరాముని గుణగణాలను వర్ణించిన పద్యమిది.
వేదశిఖలు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్సముద్రం లోతులు తెలిసినవాడు శ్రీరాముడు. ఉపనిషద్రహస్యములను చక్కగా తెలిసినవాడు శ్రీరాముడు. లోతులు తెలియడమేమిటి, ఉపనిషత్స్వరూపుడే శ్రీరాముడు. మృదువైన, అమృతమయమైన మాటలను, సమయ సందర్భములకు తగినట్లుగా మాట్లాడుట యందు నేర్పు కలవాడు శ్రీరాముడు. శ్రీరాముడు అజుడు, అంబరీషుడు, రఘువు, మాంధాత మొదలగు రాజశ్రేష్ఠుల తేజోపరాక్రమాలను పుణికిపుచ్చుకొన్నవాడు. సచ్చీలము, ఉన్నతమైన ఆత్మపదార్థము కలవాడు.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము అయోధ్యాకాండము, అభిషేక ఖండము లోనిది.
No comments:
Post a Comment