క్కద్రూసంభవదష్టులై మెలికలుంగా జుట్టుకొంచుందు రో
భద్రా! పొమ్మని పంచి రీ యెడకు నన్ బాలింపవే నీవొ య
క్షుద్రాత్ముండవు యాజ్ఞికుండవు నిదా శోకంబు నీ బోటికిన్.
పుత్రసంతానం లేదని దశరథుడు చింతాక్రాంతుడై ఉన్నాడు. అది గమనించిన ఆయన మంత్రులు, సుమంత్రుడి వద్దకు పోయి, ఏ విధంగా నైనా దశరథుని దుఃఖాన్ని పోగొట్టమన్నారు. సుమంత్రుడు దశరథుని వద్దకు పోయి మంత్రుల అంతరంగాన్ని వివరించాడు.
" మహారాజా! నీ దుస్థితిని చూసి, నీ మంత్రులందరూ, పాముకాటుకు గురైనట్లుగా మెలికలు తిరుగుతున్నారు. నన్ను నీ దగ్గరకు పంపించారు. నన్ను దయచూడవా? నీ వేమీ అల్పుడవు కాదు. గొప్ప ఆత్మపదార్థం కలిగినవాడివి. చాలా గొప్పవాడివి, యజ్ఞయాగాదులు చేసినవాడివి. ఈ విధంగా శోకించడం నీకు తగునా? "
రాజ్యపాలనలో, మంత్రుల పాత్ర చాలా విశిష్టమైనది. దశరథుని మాటల్లో చెప్పాలంటే, అతని మంత్రులు సంభాషణా చాతుర్యం కలవారు, ఇంగితజ్ఞానం కలవారు, మంచిని, ప్రజాహితాన్ని కాంక్షించే వారు, పండితులు, నీతిమంతులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, వేద వేదాంగ వేత్తలు. వారిని గురించి ఇంకా ఎంతో గొప్పగా చెప్పారు. అటువంటివారు, దశరథుని దుఃఖాన్ని నివారించమని, మంత్రులలో ముఖ్యుడైన సుమంత్రుడిని పంపించడం చాలా సముచితంగా ఉన్నది.
మంత్రుల బాధ్యతను, విశిష్టతను సుమంత్రుని ద్వారా తెలియజేసిన ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, ఇష్టి ఖండము లోనిది.
No comments:
Post a Comment