ముసలులుమీలుకర్కటకముల్ గమఠంబులు వాని కబ్బునే?
అసదృశమైన తీర్థఫల మట్టి విధము సుమీ ! తలంప
మానస మగు తీర్థమాడని జనంబులకుం బహుబాహ్యతీర్థముల్.
అగస్త్యుడు, తన భార్యయైన లోపాముద్రకు బాహ్యతీర్థముల మానసికతీర్థముల భేదాన్ని సవివరంగా చెప్పాడు. ఇప్పుడు యీ పద్యంలో ఉదాహరణ సహితంగా మానసిక తీర్థాల ఆధిక్యతను చెబుతున్నాడు.
" చెఱువుల, నదుల నీటిలో మొసళ్ళు, చేపలు, ఎండ్రకాయలు, తాబేళ్ళు ఎప్పుడూ మునిగితేలుతుంటాయి. వాటికి తీర్థఫలము వస్తుందా? బయట పుణ్యతీర్థాలకు వెళ్ళే జనానికి, మానసికతీర్థముల యొక్క గొప్పతనం కనిపించదు, ఊహలకు కూడ అందదు. "
మనలో ఉన్న దుర్గుణాలను రూపుమాపి, సద్గుణాలను పెంపొందించుకొనడం పుణ్యతీర్థాలను సేవించడం కంటె గొప్పది. దీని అర్థం పుణ్యతీర్థాలను సేవించవద్దని కాదు. మనస్సు శుద్ధంగా ఉంటే, బయటనున్న పుణ్యతీర్థ సందర్శన మానసికానందాన్ని, ఆధ్యాత్మికోన్నతిని కలిగిస్తుంది.
ఇంకొక చమత్కారం. అగస్త్యుని " బిసరుహపత్రలోచన " అనే సంబోధనలో ఉంది. బిసరుహం అంటే పద్మము. పద్మము నీళ్ళలో ఉండటం, సూర్యుని వెలుగుకు వికసించడం లోకంలో మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి పద్మలోచనకు, విప్పారిన కండ్లదానికి, జలచరాలకు పుణ్యతీర్థఫలం రాదని తెలియదా? మనసు పెట్టి చూడమంటున్నాడు అగస్త్యుడు.
ఈ పద్యం శ్రీనాథుని కాశీఖండము తృతీయాశ్వాసములో ఉంది.
No comments:
Post a Comment