ఖమును దొఱంగి నిద్రగను గాని కృశింపడు మానవుండు; నో!
యుమ! విను మిష్ట బాంధవదురుక్తులు మర్మము లంట నాట జి
త్తమున నహర్నిశంబు బరితాపము నొంది కృశించు నెప్పుడున్.
తన తండ్రి దక్షుడు యాగం చేస్తున్నాడని తెలుసుకొని, సతీదేవి అక్కడకు వెళ్ళాలనుకొంది.
ఆ విషయాన్ని భర్తయైన శివునికి చెప్పగా, " కుటిలులైన బంధువుల ఇళ్ళకు పిలువకుండ వెళితే, వారు వెళ్ళినవారిని అగౌరవంగా చూస్తారు, అనాదరానికి గురిచేస్తారు ", అని ఆమెకు హితము పలికాడు.
" మదగర్వంతో కూడిన శత్రువు ప్రయోగించిన వాడిగల ఆయుధాల దెబ్బలకు శరీరమంతా తూట్లుపడినా, ఆ వ్యక్తి నిద్రపోగలడు కానీ కృంగి కృశించిపోడు. అదే, అభిమానం కల వ్యక్తి, అయినవారు, దగ్గరివారు, అవమానం చేసి, దుర్భాషలాడితే, అది గుండెలోతుల్లో గుచ్చుకొని మాటిమాటికి గుర్తుకొచ్చి, ఆ వ్యక్తిని కృంగదీస్తుంది. "
లోకంలో ఇది చాల సహజమైన విషయం. ఈ పద్యానికి వ్యాఖ్యలో ' అయినవాళ్ళు ' అనే పదం ఉపయోగించబడ్డది. మనకు అయినవారు, కావలసినవారు, దగ్గరివారు, అనుకున్న బంధువులు మనను నిర్లక్ష్యం చేసి, ప్రక్కన పెడితే, మానధనులైనవారికి అదీ గుండెలో ముల్లులాగ యెప్పుడూ గుచ్చుకొంటూనే ఉంటుంది. అభిమానమే పెట్టుబడి కలవారికి యిది తెలుస్తుంది. మరి తన శరీరంలో సగభాగమైన అమ్మవారికి అవమానం జరుగబోతుంటే అది సమస్తజంతుచేతోవిదితాత్ముడైన శివునికి తెలియదా?
లోకవ్యవహారాన్ని యింత చక్కగా తెలియబరచిన యీ పద్యం శ్రీమదాంధ్రమహాభాగవతము చతుర్థస్కంధము దక్షయజ్ఞ ఘట్టంలో ఉంది.
No comments:
Post a Comment