బేర్మియు గాంచి ధర్మవిధి బెండిలియై ప్రజలన్ సృజించి స
త్కర్మములం బ్రశస్తములుగా గ్రతువుల్ వొనరించు సజ్జనుల్
ధర్మజ! యిందు నందును ముదంబున గాంతు రభీష్టసౌఖ్యముల్.
మార్కండేయమహర్షి ధర్మరాజునకు నాలుగు రకాలైన మనుష్యుల గురించి చెప్పాడు.
ఈ పద్యంలో, మూడవ రకానికి చెందిన మనుష్యులను గురించి చెప్పాడు. వీరు ధర్మాన్ని ఆచరిస్తారు. ధర్మ మార్గంలో ధనాన్ని సంపాదిస్తారు. పేరుప్రతిష్ఠలు తెచ్చుకుంటారు. ధర్మ మార్గాన్ననుసరించి వివాహం చేసుకొని, సంతానం పొందుతారు. సత్కర్మలు చేస్తూ, లోక కళ్యాణార్థం యజ్ఞయాగాదులను చేస్తారు. వీరిని సజ్జను లంటారు. ఇటువంటి వారు యీ లోకంలోను, పరలోకంలోను సుఖాలను పొందుతారు.
శ్రీమదాంధ్రమహాభారతము అరణ్యపర్వము చతుర్థాశ్వాసము నందలి యీ పద్యము గృహస్థాశ్రమము యొక్క విశిష్టతను, అది చతుర్విధ పురుషార్థాలలో ధర్మము పరిధిలో సాగి ఐహికాముష్మిక అభ్యున్నతికి దోహదపడుతుందని వ్యాఖ్యానిస్తున్నది.
No comments:
Post a Comment