మంతుని గౌగిలించుకొని, మధ్యమపాండవు మాద్రిపుత్రులన్
సంతతభక్తినమ్రుల బ్రసాదనయోత్కటదృష్టి జూచి, తా
నెంతయు బ్రీతి నెత్తికొనియెన్ మహినెత్తిన పుణ్యు డున్నతిన్.
నారదుని ఉపదేశంతో ధర్మరాజు రాజసూయ యాగం చేయ తలపెట్టాడు. పరమాత్మునిగా భావించే శ్రీకృష్ణుని సగౌరవంగా ఇంద్రప్రస్థానికి రప్పించే ఏర్పాటుచేసాడు. సందేశం విన్న కృష్ణుడు కూడ రథమెక్కి వాయువేగంతో ఇంద్రప్రస్థపురానికి వచ్చాడు.
అవతారమూర్తి, పుణ్యపురుషుడు అయిన కృష్ణుడు మేనత్త కుంతికి , తన కంటె పెద్దవాడయిన ధర్మరాజుకి సవినయంగా నమస్కరించాడు. బుద్ధిమంతుడయిన భీముణ్ణి కౌగిలించుకున్నాడు. భక్తిభావంతో శిరస్సు వంచి నిలుచున్న పాండవమధ్యముడు అర్జునుణ్ణి, మాద్రి సంతానమయిన కవలలు నకుల, సహదేవులను అనుగ్రహం తొణికిసలాడే కళ్ళతో చూసి, ప్రేమతో కొంచెం పైకి ఎత్తుకొన్నాడు.
ఈ పద్యంలో శ్రీకృష్ణునికి వాడిన విశేషణాలు గమనించదగినవి. కృష్ణుడు ' మహినెత్తిన పుణ్యుడు ' అనడంలో భూమిమీద అవతరించిన పుణ్యపురుషుడు అనే అర్థంతో పాటు ఆదివరాహమూర్తిగా భూమిని ఎత్తిన పుణ్యమూర్తిగా ధ్వనిస్తూ పాండవులను రక్షించే భారం భగవంతుడయిన శ్రీకృష్ణుడు వహిస్తాడనే సూచన కూడ దాగి ఉంది. ' ప్రసాదనయోత్కట దృష్టి ' అనడంలో నన్నయగారు తన రచనలోని ప్రసాదగుణాన్ని ధ్వనిమయం చేసాడని పెద్దలు డా. అప్పజోడు వేంకటసుబ్బయ్యగారి అభిప్రాయం.
ఈ పద్యం నన్నయ భారతము సభాపర్వము ప్రథమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment