గని గౌరీశు దిరస్కరించిన అసత్కర్మాత్ము నీ దక్షుని
న్ననువర్తించినవారు సంసరణకర్మారంభులై నిచ్చలున్
జననం బందుచు జచ్చుచున్ మరల నోజం బుట్టుచున్ వర్తిలున్.
భగవంతుడైన రుద్రుని నిందించిన దక్షుణ్ణి చూసి నందీశ్వరుడు కోపంతో శాప మిచ్చాడు.
" దక్షుడు మానవశరీరం గొప్పదిగా భావించి పరమాత్మ నిందకు పాల్పడ్డాడు. అయినా, దయాంతఃకరణుడైన శివుడు శాంతం వహించాడు. ఇటువంటి మూర్ఖుడికి తత్త్వం తెలియదు. వీడు దేహాన్ని ఆత్మగా భావించి పశుప్రాయుడుగా ఉన్నాడు. అందువల్ల, త్వరలో గొఱ్ఱెతలవాడవుతాడు. "
లోకంలో, మూర్ఖంగా ఎదుటివారు చెప్పినది వినకుండా వాదించే వారిని, " ఏమిటి? ఆ గొఱ్ఱెతలకాయ వేసుకొని మాట్లాడతావు? " అంటారు.
" ఎప్పుడూ అజ్ఞానాన్నే జ్ఞానంగా భావించి, ఇటువంటి మూఢుణ్ణి, పరమేశ్వరాపరాధానికి పాల్పడ్డ యీ మహాపాపిని అనుసరించేవారు, పుడుతూ చస్తూ, మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. దీనికి ఇక అంతు ఉండదు. " అని పరమేశ్వరనింద చేసేవారు పొందే ఫలితాన్ని చెప్పాడు యీ పద్యంలో నందీశ్వరుడు.
ఈ పద్యం శ్రీమదాంధ్రమహాభాగవతం చతుర్థాశ్వాసం లోని దక్షయజ్ఞ ఘట్టములో ఉంది..
No comments:
Post a Comment