చారపుగుర్రముల్ రథియు శౌర్యమునం దరమానిసాత్మ వి
స్తారము ఖండఖండములు తానట మాసరి యంచు తత్పురిన్
తేరులు నవ్వు శంకరుని తేరి నికేతన కింకిణీధ్వనిన్.
ఇది చాలా అద్బుతమైన, అందమైన, తెనాలివానికే స్వంతమయిన పద్యం.
ఇందులో కాశీనగరంలోని రథముల వర్ణన ఉంది.
కాశీలో రథాలు శివుని రథాన్ని చూసి వెక్కిరింపుగా నవ్వుతాయట. మరి నవ్వడానికి కారణం ఉండాలి కదా! చూద్దాం.
శివుడు త్రిపురాసుర సంహారానికి వెళ్ళినప్పుడు, భూమిని రథంగాను, సూర్యచంద్రులు రథచక్రాలుగాను, నాలుగు వేదాలు నాలుగు గుర్రాలుగాను, బ్రహ్మను సారథి గాను చేసుకొన్నాడు. ఇక, రథి, అంటే, రథం మీద ఉన్నవాడు సరే సరి. శివుడు. అందుకని నవ్వుతున్నాయట.
వీనిలోనే ఉంది తెనాలివాడు చేసిన చమత్కారమంతా.
సారథి బ్రహ్మ, పరమ ఛాందసుడు. ఛాందసుడంటే చాదస్తమున్న వాడని, ఛందస్సు చక్కగా చదువుకున్నవాడు, తెలిసినవాడు అని అర్థం. ఛాందసుడు మీద శ్లేష.
రథచక్రాలు సూర్యచంద్రులు. కాలగమనంలో ఇద్దరూ ఒకేసారి నడవరు. ఒక చక్రం పైకిపోతే, ఒక చక్రం క్రిందకు వస్తుంది (ఉదయాస్తమయాలు). ఇక రథం సరిగా యెట్లా నడుస్తుంది?
ప్రాత పంచారపు (సంచారపు) గుర్రములు , వేదములు. చాలా పాతవి. ముసలి గుర్రాలు.
రథి శివుడు. అరమానిసి, అనగా, సగం మాత్రమే పురుషుడు, అర్థనారీశ్వరుడు. మరి, పౌరుషం కూడా సగమే ఉంటుంది కదా!
రథము భూమి. ఎత్తుపల్లాలుగా ఉంటుంది. రథికి అసౌకర్యంగా ఉంటుంది.
ఇక కాశీనగరం లోని రథాలు, శివుని రథాన్ని చూసి, కింకిణీధ్వనులు, అంటే, జండాపై నున్న మువ్వలు, చప్పుడు చేస్తూ నవ్వాయంటే నవ్వవా?
ఎవరు వ్రాయగలరు? ఒక్క పాండురంగవిభుడు తప్ప. ఇందులో ఉన్నది వ్యతిరేకాలంకారము.
ఈ పద్యం తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము ప్రథమాశ్వాసములో ఉంది.
No comments:
Post a Comment