క్కుడు ఫల మిచ్చు; దానవిధికోవిద! వేడుట సావు వేడగా
బడు టడి పెద్ద సావు; దగు ప్రార్థన పూర్ణము సేయు నాత డా
యడిగిన వాని దన్నును దయారతి గావగ జాలు వాడగున్.
ధర్మరాజు భీష్మపితామహుణ్ణి ఒక ధర్మసందేహం అడిగాడు. అదేమిటంటే, దాన మడగటం, దాన మడగకపోవడం అనేయీ రెండింటిలో దానార్హత దేనికెక్కువున్నదని.
అవసరమున్నవాడు దానమడుగుతాడు. దానికో అర్థముంది. అడగని వాడికి దాన మివ్వడ మెందుకు? అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇక్కడే ఉంది ధర్మసూక్ష్మం. ఈ ధర్మసూక్ష్మాన్ని వివరించాడు భీష్ముడు.
అడిగిన వాడి కంటె, అడగనివాడి అర్హత తెలిసి దాన మివ్వడం యెక్కువ ఫలితాన్నిస్తుంది. అసలు అడగటమంటేనే చావు వంటిది. నిజంగా అవసరముండి అడిగేవాడు కూడా ఆత్మాభిమానం ప్రక్కన పెట్టి అడగవలసి వస్తుంది. అవసరంలేనివాడికి దానమివ్వడం, అజీర్తితో బాధపడేవాడికి అన్నం పెట్టడం వంటిది. అయితే, దానమనేది ఒక ఉత్తమగుణం కాబట్టి, అర్హు డైన సత్పురుషునికి దాన మివ్వడంలో ఒక పరమార్థం దాగి ఉంది. ఆ దానం పుచ్చుకొన్నవాడు, అర్హుడు కావున, అది అర్హమైన పనులకు, ప్రజోపయోగానికి, లోకకళ్యాణానికి ఉపయోగపడుతుంది. దీనివలన, ఇచ్చినవాడికీ, పుచ్చుకొన్నవాడికీ, పుణ్యము పురుషార్థము కలుగుతాయి. అందువల్ల పాత్రత నెరిగి దానం చెయ్యాలి. అపాత్రదానం, అర్హత లేనివానిచే అడగబడటం పెద్ద చావు. అపాత్రదానం ఇచ్చినవాడికి అపకీర్తిని తెస్తుంది. అదే, అడగకపోయినా అర్హునకు దాన మివ్వడం ఉభయత్ర, ఇచ్చినవాడికి, పుచ్చుకొన్నవాడికి, మంచిది.
ఇంకొక విషయం. పై పద్యంలో ' దానవిధికోవిద ' అనే సంబోధన గమనించతగింది. అనగా, దానమునకు సంబంధించిన విధులు చక్కగా తెలిసినవాడా! అని దీని అర్థము. అంటే, పాత్రత నెరిగి దానం చేయాలనే అర్థం దీనిలో దాగి ఉంది.
ఇంత మంచి పద్యం తిక్కన భారతం ఆనుశాసనికపర్వం ద్వితీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment