ర్యములును భీష్మునంద కల; వట్టి మహాత్ముడు పోర నీల్గె; నిం
క మనకు నేటి బాహు బల గర్వము లెక్కడి సేన లక్కటా!
సమసెనె కౌరవేశ్వరుని సంపద? ' యంచు విషణ్ణమూర్తియై.
భీష్మపితామహుడు అస్త్రసన్యాసం చేసి, శరతల్పగతుడైన తరువాత, కర్ణుడు దుర్యోధనుని కలిసాడు. కర్ణుడికి భీష్ముని గొప్ప గుణసంపద ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. దానితో అతడు విషాదానికి లోనయ్యాడు
కర్ణుడు గుర్తుకు తెచ్చుకొన్న భీష్ముని లోని ఉత్తమ గుణాలు యేమిటి? భీష్ముడు ఆజన్మబ్రహ్మచారి. అందువల్ల ఇంద్రియనిగ్రహమనేది అతనిలోని ఉత్తమగుణమైనది. దానిని మనోవాక్కాయకర్మల అమలుచేయ కలిగిన సత్యవాక్పరిపాలన రెండవది. భీష్ముని దానగుణం, సత్శీలత, అస్త్రవిద్యానైపుణ్యం సాటిలేనివి. అటువంటి మహావీరుడు యుద్ధంలో కూలిపోయాడు. ఇక మిగిలినవారి బాహుబలం, శౌర్యధనాలు యెందుకు పనికొస్తాయి? , కౌరవసైన్యానికి ఇంక దిక్కెవరు? , కురుసార్వభౌముని ఐశ్వర్యం నశించినట్లేనా? అని కర్ణుడు విషాదంతో నిండిపోయాడు.
భీష్ముడు కర్ణుడిని అర్థరథుడన్న తరువాత, భీష్ముడు యుద్ధం చేసినంతకాలం, యుద్ధరంగంలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశాడు కర్ణుడు. అటువంటి కర్ణుడు, భీష్ముని ఉదాత్త గుణాలను మెచ్చుకొని, అతడు లేని లోటు విస్మరింపలేనిదన్నట్లు మాట్లాడడం, విచారగ్రస్తుడవడం, సాటిమహావీరుని పట్ల కర్ణుని కున్న సహృదయతను, ముఖ్యంగా భీష్మపితామహుని పట్ల కర్ణుని కున్న గౌరవాన్ని, సౌశీల్యాన్ని తెలియజేస్తుంది.
భీష్ముని ఉదాత్త గుణాలను కర్ణుని నోట పలికించిన తిక్కనగారి యీ పద్యం ఆంధ్రమహాభారతం ద్రోణపర్వంలో ప్రథమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment