ప్రతతి విధంబుగ, సస్య విధుర స్థితి యైన ధరిత్రి చాడ్పు, ను
ద్ధత హరి శూన్యమైన వసుధాధర కందర భూమి చందమున్
మరి మన సేన దోచె బుధమాన్యుడు భీష్ముడు లేకయుండుటన్.
సంజయుడు కురుక్షేత్ర మహాసంగ్రామ విశేషాలను ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రునికి చెబుతున్నాడు. భీష్ముడు అస్త్రసన్యాసం చేసి శరతల్పగతుడైన తరువాత కౌరవసేనలో నిస్తేజం నెలకొంది. ఆ విషయాన్ని చక్కని ఉపమానాలతో సంజయుడు చెబుతున్నాడు.
భీష్ముడు లేని కౌరవపక్షం, వైధవ్యం పొందిన స్త్రీ వలె, కాపరి లేని ఆవులమంద వలె, పంటలు వేయని పొలం వలె, సిం హం లేని పర్వతగుహ వలె సంజయుని మనస్సుకు తోచింది.
తిక్కన భారతము ద్రోణపర్వం ప్రథమాశ్వాసంలోని యీ పద్యం కౌరవపక్షం యొక్క అతిదీనమైన స్థితిని తెలియజేస్తూనే, మహాజ్ఞాని, అరివీరభయంకరుడైన భీష్ముని గొప్పదనాన్ని తేటతెల్లం చేస్తున్నది.
No comments:
Post a Comment