క పరత్వంబున జేసి యైహికము దుఃఖప్రాయమై పోవగా
విపులానందము బొంద గల్గు దుది నావిర్భూతభోగైకలో
లుపబుద్ధిం జిరపుణ్యశీలురకు నా లోకంబునన్ భూవరా!
ఎఱ్ఱన భారతం అరణ్యపర్వం చతుర్థాశ్వాసంలోని యీ పద్యానికి ఒక ప్రాధాన్యత ఉంది. కథాపరంగా, మార్కండేయమహర్షి ధర్మరాజుకు మూడురకాలైన మనుష్యులను గురించి చెబుతాడు. మొదటిరకం, ఇంద్రియసౌఖ్యాలను గూర్చి మాత్రమే ఆలోచించే ఇహలోకజీవులు. రెండవరకం, ఇహపర సౌఖ్యాలను గూర్చి ఆలోచించేవారు. ఇక మూడవరకం, పరలోకబుద్ధిజీవులు.
ఈ పద్యంలో మధ్యమ తరగతికి చెందిన జీవులను గురించి చెబుతున్నాడు. వీరు ఉపవాసాలు, వ్రతాలు, సద్గ్రంథపఠనం, తీర్థయాత్రలు చెయ్యడం వంటివి చేస్తుంటారు. ఇవి చేయడం వల్ల, ఇహలోకసౌఖ్యాలు దుఃఖప్రాయమైనవని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఇటువంటి పుణ్యశీలురకు పరలోకబుద్ధి యేర్పడి, పరలోక సౌఖ్యమే మంచిదిగా కనిపిస్తుంది.
ఎఱ్ఱన పూరించిన అరణ్యపర్వశేషంలోని సూక్ష్మాంశాలను తెలుసుకోవాలంటే, శ్రీయుతులు తిప్పాభట్ల రామకృష్ణమూర్తి, సూరం శ్రీనివాసులు గార్ల " భారత నిరుక్తి -ఎఱ్ఱన ధర్మోక్తి " అనే గ్రంథాన్ని చదువవలసినదిగా విన్నపం.
No comments:
Post a Comment