Wednesday, 1 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 141 (నన్నయ భారతము:ఆదిపర్వము:పంచమాశ్వాసము/ వసుచరిత్రము: ప్రథమాశ్వాసము)









ఇక  కొద్ది రోజులలో కొత్త సంవత్సరం రాబోతున్నది.  కొత్త సంవత్సరాన్ని మన తెలుగు వారందరు సంవత్సరాదిఉగాదియుగాది అని పిలుస్తారు.  ఇదివరకు చెప్పినట్లుగానేకాలము రెండు రకాలుగా భావించబడుతూ ఉందిదృశ్యమాన జగత్తులో మనమందరము ఉన్నకాలాన్ని ఖండకాలమంటారు.  అంటేలిప్తలు లిప్తలుగా విభజింపబడిన కాలమురెండవది అఖండ కాలము.  యుగాలు  మారినామహాప్రళయం సంభవించినా,   మన్వంతరాలు దాటినాకల్పాంతమైనాచెక్కుచెదరకమహాప్రవాహంగా సాగిపోయేది యీ అఖండ కాలముఖండకాలములో వ్యక్తమైన చరాచర జగత్తు నశించినాఅక్షరమై అఖండకాలంలో నిలిచిపోయేది సదాశివతత్త్వము.  సదాశివము.  అది ఎల్లప్పుడూ మంగళప్రదమైనదిఆనందదాయకమైనది.  అదే సచ్చిదానంద తత్త్వము.

కానీఆశ్చర్యకరమైన విషయమేమంటేప్రతి ముగింపు లోనూఒక ఆరంభం ఉంటుంది.  అదే కొనసాగింపుప్రతి యుగాంతము తరువాత యుగాది కూడా ఉంటుంది.  శిశిరం తరువాతవసంతం రాక తప్పదుదుఃఖమనేది శాశ్వతము కాదుఅలాగనిసుఖానుభూతి కూడా శాశ్వతము కాదు రెంటికీ భిన్నమైనఅతీతమైన స్థితిఆనందాన్ని కలుగజేస్తుంది.  అదే అద్వైతస్థితిసుఖదుఃఖాలు రెంటినీ సమంగా చూడగలిగిన మానసికస్థితి.  తండ్రి మరణిస్తాడు తండ్రి కొడుకులో జీవిస్తాడుఇదే భారతీయ సనాతన తత్త్వం.  అది సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ అని వేదంలో చెప్పినట్లుగాసహస్రముఖీనంగాఆదిశేషుని వేయిపడగలతో ధర్మాన్ని రక్షిస్తూభారతీయ దాంపత్య జీవితంలో స్త్రీపుంస యోగోద్భవమవుతుంది పరమ సత్యాన్ని తెలియజేసేవే మన అరవై సంవత్సరాలుమనిషి జీవనప్రమాణంలో షష్టిఅనగాఅరవై  సంఖ్యకు ప్రాముఖ్యత ఉందిషష్టి అని  క్రింద టకారం రావాలి.  ఠకారం రాకూడదుఅట్లా వస్తే అది షష్ఠి  అయిఆరు సంఖ్యను తెలియజేస్తుంది.

మనిషి  జీవనగమనంఅఖండకాలంలో అరవై సంవత్సరాలు ఒక రీతిగా గడిస్తే తరువాత భగవంతుడు ప్రసాదించిన ఆయుఃప్రమాణంతోఅఖండకాలానుభూతితో సదాశివతత్త్వంతో సమ్మిళతమయిఅఖండమైన ఆత్మానుభూతి పథంలో పయనించాలి.  అదే షష్టిపూర్తి ఉద్దేశ్యం.

ఇక విషయానికి వస్తే పరమ సత్యాన్ని ప్రతీకాత్మకంగా తెలియజేస్తూషడ్రుచుల మేళవింపుగాఅన్ని అనుభవాల కలబోతగా ఉగాదిని జరుపుకుంటాము.

కొత్త సంవత్సరం వసంతఋతువుతో ప్రారంభమవుతుందివసంతంలోప్రకృతి తన అందాలతో కనువిందు చేస్తుంది.   వసంతఋతు అందాలకు ముగ్ధులు కానివారు ఉండరుముగ్థులైకవితాత్మకంగా స్పందించని కవులు లేరు.

ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారతము ఆదిపర్వంలో వసంతఋతువర్ణన అద్భుతంగా చేశారు.

కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెసగెం;   జూ
తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచు ముద మ్మొనర వాచా
లమ్ములగు కోకిల కులమ్ముల రవమ్ము మధురమ్మగుచు విన్చెననిశమ్ముసుమనోభా
రమ్ముల నశోకనికరమ్ములును జంపకచయమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్.

చందన తమాలతరులందు నగరుద్రుమములందు గదళీవనములందు లవలీ
మాకంద తరుషండములయందు ననిమీలదరవిందసరసీవనములందు వనరాజీ
కందళిత పుష్పమకరందరసముం దగులుచుం దనుపు సౌరభము నిండి జనచిత్తా
నందముగ బ్రోషితులడెందము లలందురగ మందమలయానిల మమందగతి వీచెన్.


ఆంధ్రమహాభారతం ఆదిపర్వంలోని వసంతఋతువర్ణనకు నన్నయగారు రెండు లయగ్రాహి వృత్తాలను ఎంచుకొనడానికి కూడా యీ భారతీయ సనాతనధర్మమే మూలం.  అది తరువాత చూద్దాం.

వసంత ఋతువుసంవత్సరంలో మొట్టమొదటగా వచ్చే ఋతువుఅంతేకాదుపరమాహ్లాదకరమైన ఋతువు వసంతముచెట్లన్నీ చిగిర్చిపూతపూసిపూలు వేసికాయలు కాస్తాయిపూలలోని మకరందాన్ని గ్రోలడానికి తుమ్మెదలు బారులు తీరతాయివాటి ఝంకారాలు వనమంతా ప్రతిధ్వనిస్తాయిమామిడిచిగుళ్ళు అగ్నిదేవుని నాలుకల్లా అరుణారుణ వర్ణంతో మెరిసిపోతుంటాయి మావిచిగురు తినడానికిచిలుకలుకోయిలలు గుంపులుగా వస్తాయి.  శుకపికాలాపాలతో ప్రకృతి మనను మైమరపింపజేస్తుంది.

పూలు కమ్మని వాసనని విరజిమ్ముతున్నాయిపువ్వుల్లోని తేనె త్రాగడానికి తుమ్మెదలు ఝుంకారం చేస్తూ పూలమీద వ్రాలుతున్నాయిమామిడి చెట్లన్నీ చిగురులు తొడిగాయిలేత మామిడిచిగురు తినడానికి  చిలుకలుకోయిలలు గుంపులు తీరుతున్నాయిచిలుకల ముద్దుపలుకులతోకోయిలల కుహూరావాలతో వనమంతా ప్రతిధ్వనిస్తున్నది.  అశోకాలుసంపెంగలుమోదుగలు విరగబూసాయి.  ఇదీ మొదటి లయగ్రాహి వృత్తానికి అర్థం.

నన్నయగారి కవితాగుణాలలో అక్షరరమ్యత ఒకటి మొదటి పద్యంలో మకారం ద్విరుక్తంఒకదాని క్రింద ఒకటి ఒత్తు రావడం వల్లతుమ్మెదల ఝుంకారముకోయిలల కుహూరవము యీ పద్యంలో ప్రతిధ్వనిస్తున్నాయి.  మకారం నాదాక్షరంసప్తస్వరాలలో ఒకటి.  అందువల్లపద్యంలో దానిని ద్విరుక్తంగా వాడటం వల్ల శ్రవణసుభగత్వం ఏర్పడుతున్నది.

ఇక రెండవ పద్యం వసంతఋతు వర్ణన కొనసాగింపు.  వనాల్లో పెరిగే చెట్లనీచల్లగా వీచే మలయమారుతాన్నీ వర్ణించే పద్యం.  వనాల్లోమంచిగంధపు చెట్లుచీకటి చేట్లుఅగరు చెట్లుఅరటి తోటలులవలీతీగల తోటలుమామిడి తోపులువికసించిన తామర కొలనులు తామరలపై వ్రాలి మకరందాన్ని గ్రోలే తుమ్మెదలువాటి ఝుంకారాలు,  స్పర్శసుఖాన్ని కలిగిస్తూవిరహార్తులకు మన్మథతాపాన్నీదుఃఖాన్నీ కలిగించేమలయమారుతం - అన్నీ చక్కగా వర్ణించబడ్డాయి యీ పద్యంలో.

పై పద్యంలో స్వరమాధుర్యాన్ని ధ్వనింపజేయడానికి ద్విరుక్త మకారం వాడితేయీ పద్యంలో బిందుపూర్వక దకారం వాడి ' మెల్లగ వీచే చల్లగాలితో(మలయమారుతంతో) ' శైత్యోపచారం చేయించారు నన్నయగారు.

అయితేనన్నయగారు రెండు లయగ్రాహి వృత్తాలను వరుసగా వసంతఋతు వర్ణనకు ఎందుకు వాడారు?  వసంతఋతువు పరమ రమణీయమైనపికశుకాలాపములతో నాదసుఖాన్ని కలిగించే ఋతువు.   సంగీతంలో లయకున్న ప్రాధాన్యత రసజ్ఞులకు తెలిసిందేరెండవదిలయమవడమంటే అంతమవడం.  ఆహ్లాదకరమైన వసంతఋతువుపాండురాజునకే గాకమాద్రికి కూడామరణం సంప్రాప్తమయ్యేట్లు చేసింది.  లయగ్రాహి అంటే మరణాన్ని తెచ్చిపెట్టుకోవడం అని అర్థం చేసుకోవాలిఅందుకేరెండు లయగ్రాహి వృత్తాలలోఅనివార్యమైన మరణమనే సత్యాన్ని ధ్వనింపజేసారు నన్నయగారు.  నన్నయగారు ఋషి.

నన్నయ భారతం ఆదిపర్వం పంచమాశ్వాసం లోని యీ పద్యాలకు వ్రాయబడిన యీ మాటలకు,   శ్రీమదాంధ్ర మహాభారతమునకు డాఅప్పజోడు వేంకటసుబ్బయ్యగారు వ్రాసిన వ్యాఖ్యానము ఆధారమని సవినయంగా విన్నవించుకుంటున్నాను.

ఇక  భట్టుమూర్తిగారి వసుచరిత్రములోని యీ పద్యం చూడండి.

లలనాజనాపాంగ వలనావసదనంగ తులనాభికాభంగ దోఃప్రసంగ
మలసానిలవిలోల దళసాసవరసాల ఫలసాదరశుకాలపన విశాల
మలినీ గరుదనీకమలినీ కృతధునీ కమలినీ సుఖిత కోకకుల వధూక
మతికాంత సలతాంత లతికాంతర నితాంత రతికాంతరణ తాంత సుతనుకాంత

మకృతకామోదకురవకావికల వకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత
కలిత కలకంఠకుల కంఠకాకలీ విభాసురము వొల్చు మధుమాసవాసరంబు.

వసంతము సుమనోహరముహృదయాహ్లాదకరము అని చెప్పాము కదా ఋతువులో గోరంట పూలు విస్తారంగా పూస్తాయి.  పొగడలు మొగ్గలు తొడుగుతాయి.  పూల సువాసన యెల్లెడలా వ్యాపించి మనల్ని పరవశుల్ని చేస్తుందితియ్యని మామిడిపండ్ల కోసంచిలుకలుకోయిలలుగుంపులు గుంపులుగా చేరి కల కలారావాలు చేస్తాయికాముకులు పొదరిండ్లలో కౌగిలి సుఖాన్ని అనుభవిస్తుంటారుతుమ్మెదల ఱెక్కల నల్లదనంతో నల్లనైన తమ్మితీగెలు చక్రవాక పక్షుల్ని అలరిస్తాయి.   విధంగావసంతము శృంగారోద్దీపనకు కారణమౌతుంది.

రామరాజభూషణుడు సంగీతగానకళానిధి.  వసుచరిత్రములోని పద్యాలు యెక్కువభాగం శ్లేషార్థాలతో కూడియుండిసంగీత స్వర ప్రధానమై ఉంటాయి.  పైన చెప్పబడినటువంటి పద్యాన్ని ఇంకొకరు వ్రాయలేరని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు వారి కావ్యపరీమళము అనే విమర్శన గ్రంథంలో మెచ్చుకున్నారు.

మహాకవులు ప్రతఃస్మరణీయులు కదా!






No comments:

Post a Comment

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like