వరదుం డీశుడు భక్తవత్సలుడు దేవవ్రాతసేవ్యుండు శం
కరు డానందు డనాధనాధుడని లోకంబెల్ల సద్భక్తిత
త్పరులై సార్థకనామధేయ మహిమోద్దామస్థితున్ నిన్ను దు
స్తరదుఃఖాపనయార్థ మర్థి గొలుతుర్ దారిద్ర్యవిద్రావణా!
" దారిద్ర్యాన్ని పోగొట్టే ఓ శివా! వరాలను ఇచ్చేవాడివని, సర్వ లోకాలకు ప్రభువువని, భక్తుల యెడల అపారమైన వాత్సల్యం కలవాడివని, దేవతలందరిచే సేవింపబడేవాడివని, శుభాలను కలుగజేసేవాడివని, ఆనందమయుడివని, దిక్కు లేనివారికి దిక్కని, లోకంలోని వారంతా సద్భక్తితో నిన్ను కొలుస్తూ ఉన్నారు. శివుడు, శంకరుడు అనే పేర్లు నీ యెడల సరియైనవని తలుస్తున్నారు. మహామహిమాన్వితుడవైన నీవు వారి భరించరాని దుఃఖాన్ని పోగొడతావని నిన్ను కొలుస్తున్నారు. "
నన్నెచోడుని కుమారసంభవము కావ్యము, దశమాశ్వాసము నందలి బృహస్పతికృత దారిద్ర్యవిద్రావణ స్తవంలో ఇదీ నాలుగవ పద్యం. కంఠస్థం చేసి చక్కగా, భక్తి తత్పరతతో పాడుకొన దగిన పద్యం.
No comments:
Post a Comment