ప్రియహితసత్యవాక్య! యరిభీషణ! కృష్ణ! భవన్నిదేశ సం
శ్రయమున నున్న మా కధికశత్రుజయం బగు టేమి పెద్ద; ని
శ్చయముగ నింక మోక్షితుల సర్వమహీశులు, నిమ్మహాధ్వర
క్రియయును సిద్ధిబొందెన అకిల్బిషకీర్తి వెలుంగుచుండగన్.
నన్నయ భారతము, సభాపర్వము, ప్రథమాశ్వాసము లోని యీ పద్యం, ధర్మరాజు వాక్చాతుర్యానికి గీటురాయి.
" ప్రియహితసత్యవాక్య " అని సంబోధించాడు కృష్ణుణ్ణి. కృష్ణుడు ప్రియంగా, హితంగా, సత్యం పలికేవాడు. ఇంకొకటి. అరిభీషణుడు. శత్రుభయంకరుడు. రెండూ యదార్థమే. అటువంటి, కృష్ణుని అండ ఉంటే, బలవంతులైన శత్రువులను జయించడం ఒక పెద్ద విశేషమా? అందువల్ల, జరాసంధుని చెరలో ఉన్న రాజులకు విముక్తి గలగడం, రాజసూయ యాగం నిర్విఘ్నంగా సాగడం తథ్యమని ధర్మరాజు నిశ్చయాభిప్రాయం. పైన చెప్పినవన్నీ యదార్థాలే అయినా, మనసుకు హత్తుకొనేటట్లు చెప్పడమే మాట నేర్పు. అందులో, కృష్ణుడు, ధర్మరాజు ఒకరికి ఒకరు తీసిపోరు.
" భవన్నిదేశసంశ్రయమున నున్న మాకు " అని భారం మొత్తం పరమాత్ముని మీద వేసాడు.
No comments:
Post a Comment