రాజుగారి కొడుకులలో ఒకడు పొట్టిగా ఉండటం వల్ల, తక్కిన అన్నదమ్ముల కంటికి వాడానడం లేదు. తండ్రి కూడా వాడిని తిరస్కారభావంతో చూసి విసుక్కుంటున్నాడు. అప్పుడు తెలివిగల ఆ కుర్రవాడు అన్నాడు , " నాన్నా! బుద్ధిమంతుడైన పొట్టివాడు, బుద్ధిహీనుడైన పొడుగువాని కన్నా మేలుగదా! , అని. ఆకారపుష్టిగల ప్రతిదానికీ మూల్యం హెచ్చుతుందా? మేక చిన్నదయినా, దాని మాంసం తినడానికి పనికొస్తుంది గాని, ఏనుగు పెద్దదని, దాని మాసం తింటామా?
బక్కచిక్కియు నుత్తమాశ్వంబు మేలు
గాదె, దొడ్డెడు ఖరములకంటె ననుచు
తెలివిగల బక్కవాడొక తెలివిలేని
స్థూలకాయునితో నన్న సూక్తి వినవె?
ఈ మాటలతో తండ్రి నవ్వడమే గాక అతనికి కనువిప్పయింది.
ఎవ్వడైన మాటాడ నోరెత్తుదాక
తెలివియును లోపమును దాగి తెలియరావు;
ప్రతివనంబును శూన్యగర్భంబటంచు
నూహసేయకు, పులి కూర్కుచునుండవచ్చు.
మనిషిలో ఉన్న ప్రతిభావిశేషాలను కానీ, లోపాలను కానీ మనమేం కుట్టిచూడలేము. ఎవరైనా నోరు తెరిచి మాట్లాడేవరకు, వారెటువంటివారో తెలియదు. ఇదే మనం తెలుకోవలసిన జీవిత సత్యం..
No comments:
Post a Comment