మగధరాజు జరాసంధునికి హంసడిభకులు రక్షణ కవచాల్లాంటివారు. వారిద్దరూ మరణించడంతో, జరాసంధుడు అయనాలు లేని సూర్యుడి వలె, రెండు రెక్కలూ తెగిన గరుడిని వలె, గర్వాన్ని కోల్పోయి, యిక తనకు వినాశకాలం దాపురించిందన్న నిశ్చయించుకొన్నాడు.
అయనాలు రెండు - ఉత్తరదక్షిణాయనాలు. పద్యంలో జరాసంధుణ్ణి అయనాలు లేని సూర్యునితోను, రెక్కలు తెగిన గరుడితోను పోల్చటం వల్ల, అతడు ఎవరిపైకి దండెత్తి వెళ్ళలేక మగధను అంటిపెట్టుకొని, తన అంత్యకాలాన్ని నిరీక్షిస్తున్నాడని కృష్ణుని భావనగా అర్థం చేసుకొనవచ్చును.
సమయానుకూలంగా రాజకీయ వ్యూహాన్ని పన్నడంలో కృష్ణుని మించిన వారు లేరని నన్నయ భారతము సభాపర్వము ప్రథమాశ్వాసము లోని యీ పద్యం స్పష్టం చేస్తుంది.
No comments:
Post a Comment