పరమ పవిత్రముల్ యజన భాజనముల్ దము విన్న జూచినన్
దురితచయంబులన్ దొలగ ద్రోవగ జాలు బ్రధానకర్త కు
త్తర గతి లాభవైభవము తంగెటి జున్నుగ జేయు గోవు లె
వ్వరు దగ దీని గొల్తు రనివారణ జొత్తురు వారు నాకమున్.
ఆంధ్రమహాభారతము ఆనుశాసనికపర్వము తృతీయాశ్వాసములో తిక్కనగారు గోవు యొక్క పవిత్రతను, గొప్పదనాన్ని చక్కగా తెలియబరచారు.
భారతీయులకు గోవు చాల పవిత్రమైనది. గోవుకు సంబంధించిన గో పంచకము యజ్ఞం కోసం వినియోగిస్తారు. అటువంటి గోవులను గురించి విన్నా, చూసినా, యెటువంటి పాపాలయినా పటాపంచలయిపోతాయి. ఇక ఉత్తరకర్మలలో గోదానం యొక్క విశిష్టత మనకు తెలిసినదే. గతించినవారు పుణ్యలోకాలకు పోవడానికి గోదానం తంగెటిజున్నుగా సమకూరుస్తుంది. గోపూజ చేసినవారు మరణానంతరం స్వర్గానికి చేరుకుంటారు. దానిని ఎవరూ అడ్డుకొనలేరు.
No comments:
Post a Comment