భరతకులప్రసూతులరు భాసురశస్త్రమహాస్త్ర విద్యలం
గరము ప్రసిద్ధుడై పరగు గౌతము శిష్యుల; రిట్టి మీకు
దుష్కరముగ నూతిలో బాడిన కాంచనపిండు గొనంగనేర కొం
డొరుల మేఘంబు జూచి నగుచుండగ ఝనె నుపాయహీనతన్.
బాల్యమిత్రుడు, సహాధ్యాయి అయిన ద్రుపదుని వద్ద అవమానం పొంది, హస్తినాపురం వైపుకి వచ్చిన ద్రోణుడు, నగరం బయట ఆడుకుంటూ , నూతిలో పడ్డ బంగారు బంతిని వెలిని తీయడానికి ప్రయత్నిస్తున్న ధృతరాష్ట్ర పాండునందనులను చూసాడు. వారితో ఆయన యీ విధంగా అన్నాడు.
" మీరు భరతవంశంలో పుట్టారు. శస్త్రాస్త్రవిద్యలలో పేరు గాంచిన కృపాచార్యుని శిష్యులు. అటువంటి మీరు ఉపాయం లేకుండా, బావిలో పడ్డ బంతిని తీయలేక, ఒకరి ముఖం ఒకరు చూసుకంటూ నవ్వుకొనడం భావ్యమా? "
ఉపాయం లేనివాడిని ఊళ్ళోనుంచి తరిమేయాలన్నారు పెద్దలు. " ఉపాయహీనతన్" అన్న పదం వాడటం వల్ల, ఉపాయంతో, సమయజ్ఞతతో ఏ పనైనా సాధించగలమని ద్రోణుని సూచన.
ఈ పద్యం నన్నయ భారతము ఆదిపర్వంలో ఉన్నది.
No comments:
Post a Comment