నీవ విధాత, వింద్రుడవు నీవ, సమస్తజనేశ్వరుండవున్
నీవ, యశేషధర్మములు నీవ యెఱుంగుదు, నిన్ను బోలగా
నీ వసుధాతలంబున మహీశ్వరు లెవ్వరు లేరు, సన్మునీం
ద్రావలి యెప్డు నిన్ను గొనియాడు బరిస్ఫుటవాక్యభంగులన్.
అత్రి అనే ముని, భార్య చెప్పిన దాని ప్రకారం, వైన్య మహారాజు దగ్గరకు దాన మడగడానికి వెళ్ళాడు. ఆశీర్వదించి, ఆయనను యీ విధంగా కీర్తించాడు.
" ఓ మహారాజా! నీవే బ్రహ్మదేవుడివి. నీవే ఇంద్రుడివి. సమస్త ధర్మాలు తెలిసినవాడివి నీవే. నీతో సరిపోల్చదగినవారు యీ భూమండలంలో లేరు. మునులందరు ఎప్పుడూ నిన్ను మంచి మాటలతో పొగుడుతుంటారు. "
" నా విష్ణుః పృధివీపతిః " అంటారు. ఆ విధంగా, భూమిని పాలించే రాజు విష్ణుస్వరూపుడయినప్పుడు, అతనిని బ్రహ్మ, ఇంద్రుడు అనడంలో అనౌచిత్యం లేదు.
ఈ పద్యం ఎఱ్ఱన భారతము, అరణ్యపర్వశేషము, చతుర్థాశ్వాసములో ఉంది.
No comments:
Post a Comment