మలినుండై కడు డస్సి క్రుస్సి మది నున్మానాకృతిం దేజముం
దలయుం జీరయు దోడు వీడ జడుడై దైన్యంబునం బొంది దు
ర్బలుడై మెచ్చనివారి వేడజను దుర్భాగ్యాత్ముడున్ ని న్నెదం
దలపంగాంచి సురేంద్రుడై వెలయడే దారిద్ర్యవిద్రావణా!
నన్నెచోడుడు రచించిన కుమార సంభవము కావ్యము దశమాశ్వాసములోని బృహస్పతికృత దారిద్ర్యవిద్రావణ స్తవము నందలి రెండవ పద్యము యిది.
ఈ పద్యంలో దౌర్భాగ్యుడిని గురించి చెప్పి, అట్టివాడు కూడా శివుని వేడుకుంటే, అతని దరిద్రాన్ని పోగొడతాడని చెబుతున్నాడు.
దౌర్భాగ్యుడు అంటే యెవరు? పాపాత్ముడయి, బాగా అలసిపోయి, కృశించి, గర్వం పొంది, దీనుడై, బలహీనుడై, ఇష్టం లేనివారి దగ్గర కూడా చేయిచాచవలసిన దుస్థితి పట్టిన వాడు దౌర్భాగ్యుడు.
అంతటి దౌర్భాగ్యజీవి కూడా శివుని మనసారా వేడుకుంటే, అతణ్ణి దేవేంద్రుని వలె ప్రకాశింప చేయడా అంటున్నాడు దేవగురువు బృహస్పతి.
No comments:
Post a Comment